News October 28, 2025
HYD: షుగర్ ఉందా? మీ కోసం ప్రత్యేక చెప్పులు

డయాబెటిక్ పేషెంట్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఉస్మానియా ఆస్పత్రి సూపరిండెంట్ డా.రాకేశ్ సహాయ తెలిపారు. ఉస్మానియాలో డయాబెటిక్ ఫుట్ క్లినిక్ ద్వారా రోగులకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. కాళ్లకు తిమ్మిర్లు, స్పర్శ లేకపోవడం, గాయాలు నయం కాకపోవడం వంటి లక్షణాలు కనిపించే వారు తప్పనిసరిగా ఈ సేవలను పొందాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే పరిస్థితి విషమించొచ్చని హెచ్చరించారు.
Similar News
News October 28, 2025
HYD: 2 గంటలకుపైగా సోషల్ మీడియాలోనే

నేషనల్ వెబ్ ఇండెక్స్ సర్వే ప్రకారం నగర యువత రోజుకు 2 గంటలకుపైగా సోషల్ మీడియాలో గడిపేస్తున్నట్లు తేలింది. ఫ్యామిలీ పంచాయితీలు, వివరాలు అన్నీ ఇందులో పెట్టేస్తూ లేనిపోని వ్యవహారల్లో తలదూరుస్తున్నట్లు తేలింది. SMను సమాచారం కోసం కాకుండా వినోదం, కొత్త ఫ్రెండ్స్‌తో ఛాటింగ్‌కు ఓపెన్ చేస్తున్నట్లు తేలింది. దీంతో చదువు అటకెక్కుతుందని, వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదని, SMపై నియంత్రణ అవసరమని సూచించారు.
News October 28, 2025
HYD: రాత్రి భారీ వర్షం.. పలుచోట్ల చిరుజల్లులు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్, నాచారం, తార్నాక, హబ్సిగూడ, శివంరోడ్ పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. శివారు పెద్దఅంబర్‌పేట్, ఇబ్రహీంపట్నం, కందుకూరు తదితర ప్రాంతాల్లో రాత్రి 1 నుంచి ఉ.3వరకు భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లగా మారింది. రోడ్లపై నీరు నిలిచింది. ఆఫీసు సమయాల్లో ట్రాఫిక్ నెమ్మదించింది. ఈరోజు సాయంత్రం గ్రేటర్ వ్యాప్తంగా వర్షం కురిస్తుందని అధికారులు అంచనా వేశారు.
News October 28, 2025
HYD: ఇంటింటికీ వెళ్లి మాగంటి సునీత ప్రచారం

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో వెంగళరావునగర్ డివిజన్ పరిధిలో బీఆర్ఎస్ నేతలు ఈరోజు ప్రచారం చేపట్టారు. సిద్ధార్థనగర్ ఏజీ కాలనీలో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేపట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ ఎంతో అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. BRSకు ఓటు వేసి, తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.


