News January 5, 2026

HYD: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్నారా.. జాగ్రత్త!

image

సంక్రాంతికి ఊర్లకు వెళ్లే HYD నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. ఇళ్లకు తాళం వేసేవారు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. విలువైన నగలు, నగదును ఇళ్లలో ఉంచకుండా జాగ్రత్త పడాలన్నారు. నేరాల నియంత్రణకు పౌరుల సహకారం కీలకమని, ఏదైనా అత్యవసరమైతే వెంటనే ‘డయల్ 100’ను సంప్రదించాలని స్పష్టం చేశారు. పండుగ పూట దొంగతనాల నివారణకు పోలీసులు గస్తీ ముమ్మరం చేశారని తెలిపారు.

Similar News

News February 21, 2026

మార్కెట్లో కల్తీ పాలే ఎక్కువ!

image

రోజూ తాగే పాలు నాణ్యమైనవేనా? అంటే సందేహించాల్సిందే! దేశవ్యాప్తంగా పరీక్షించిన ప్రతి 3 శాంపిల్స్‌లో ఒకదాంట్లో కల్తీ జరిగినట్లు తేలుతోంది. గతేడాది ప్రతి 100 శాంపిళ్లలో 38 నమూనాలు టెస్టుల్లో ఫెయిలయ్యాయి. పాలల్లో డిటర్జెంట్లు, యూరియా వంటివి కలుపుతున్నారు. ఇటీవల గుజరాత్‌లో బయటపడిన <<19076004>>డెయిరీ ఉదంతమే<<>> ఇందుకు ఉదాహరణ. పదేళ్లలో మన దేశంలో పాల ఉత్పత్తి 63% పెరిగింది. అందులో ఒరిజినల్ <<19076364>>పాల శాతం<<>> ఎంతనేది దేవుడికెరుక.

News February 21, 2026

గాలి ఉండగానే తూర్పారబోయాలి

image

ధాన్యం నుంచి పొట్టును వేరు చేయడానికి రైతులు గాలి వచ్చే దిశలో ధాన్యాన్ని పై నుంచి కిందకు పోస్తారు. దీనినే తూర్పారబట్టడం అంటారు. గాలి బలంగా ఉన్నప్పుడు ఇది చాలా సులభంగా, వేగంగా పూర్తవుతుంది. గాలి లేనప్పుడు ప్రయత్నిస్తే పొట్టు సరిగా విడిపోదు, కష్టం వృథా అవుతుంది. జీవితంలో కూడా మనకు అనుకూలమైన పరిస్థితులు లేదా గొప్ప అవకాశాలు ఎల్లప్పుడూ ఉండవు. అవి లభించినప్పుడే సద్వినియోగం చేసుకోవాలని ఈ సామెత చెబుతుంది.

News February 21, 2026

స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లకు స్టీమ్ రైస్!

image

TG: రాష్ట్రంలోని స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లకు స్టీమ్ రైస్ సరఫరా చేయాలని సివిల్ సప్లయ్స్ శాఖ నిర్ణయించింది. స్టీమ్ రైస్‌తో విద్యార్థులకు అందించే ఫుడ్ నాణ్యత పెరుగుతుందని ఆ శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. దీనితో రాష్ట్రంలో 35 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నట్లు తెలుస్తోంది. మిల్లులో ఆడించకముందే ఆవిరితో ప్రాసెస్ చేయడం వల్ల స్టీమ్ రైస్ గింజలు విరగవు. అన్నం రుచిగా, పొడిగా ఉంటుంది.