News April 23, 2025

HYD: సంగారెడ్డి జైలుకు అఘోరి

image

లేడీ అఘోరిని పోలీసులు అరెస్ట్ చేసి నార్సింగి PSకు తరలించి, 2 గంటల పాటు విచారించిన అనంతరం చేవెళ్ల ప్రభుత్వ దవాఖానాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరు పర్చారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని అఘోరి చెప్పడంతో లీగల్ ఎయిడ్ సర్వీసెస్ న్యాయవాది కుమార్‌ను జడ్జి నియమించారు. వాదనలు విన్న జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు అఘోరిని సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.

Similar News

News December 19, 2025

జగిత్యాల జిల్లాలో మాక్ డ్రిల్ నిర్వహణకు ఏర్పాట్లు

image

డిసెంబర్ 22న నిర్వహించనున్న విపత్తుల నిర్వహణ మాక్ డ్రిల్‌ను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. ముందస్తు అప్రమత్తత, సమన్వయ చర్యలతో ప్రాణాలు, ఆస్తి నష్టాలు తగ్గించవచ్చని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలో అధికారులు సిద్ధంగా ఉండి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

News December 19, 2025

ఐదో టీ20: టాస్ ఓడిన భారత్

image

అహ్మదాబాద్ వేదికగా భారత్‌తో జరుగుతోన్న ఐదో టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమ్ ఇండియాలో హర్షిత్, గిల్, కుల్దీప్ స్థానాల్లో బుమ్రా, శాంసన్, సుందర్ వచ్చారు.

IND: సూర్య(C), శాంసన్, అభిషేక్, తిలక్, పాండ్య, జితేశ్, సుందర్, దూబే, వరుణ్, బుమ్రా, అర్ష్‌దీప్

News December 19, 2025

సీఎం పర్యటనకు అనకాపల్లిలో పటిష్ట బందోబస్తు

image

సీఎం చంద్రబాబు నాయుడు కసింకోట మండలం తాళ్లపాలెంలో 20వ తేదీన పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP తుహిన్ సిన్హా తెలిపారు. పర్యటన ప్రశాంతంగా సాగేందుకు 1500 మంది పోలీసులతో భద్రత కల్పించారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణాలు, రోడ్డు మార్గాల్లో నిరంతర తనిఖీలు నిర్వహించాలని, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇతర శాఖలతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.