News August 24, 2025

HYD: సంతాన సమస్యలు ఉన్నాయా? ఇక్కడకు వెళ్లండి

image

HYDలో సృష్టి ఘటనతో సంతాన సమస్యలు ఉన్న వారు ప్రభుత్వ ఆస్పత్రుల వైపు చూస్తున్నారు. ఈ సమస్యలు ఉన్న వారికి వరప్రదాయానిగా ప్రభుత్వ ఆస్పత్రులు నిలుస్తున్నాయి. గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్ సెంటర్, ప్లేట్ల బురుజు ఆస్పత్రిలో సంతాన సాఫల్య కేంద్రాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే కొండాపూర్ ఆస్పత్రిలోనూ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
# SHARE IT

Similar News

News August 24, 2025

HYD: ‘సహస్ర చెల్లి లాంటిది.. తప్పు చేయలేదు: వెంకట్

image

కూకట్‌పల్లిలో సహస్ర హత్య కేసులో పోలీసులు జరిపిన అంతర్గత విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితుడు వెంకట్ వివిధ కారణాలతో డిప్రెషన్‌కు గురైనట్లు గుర్తించారు. బ్యాట్‌ను దొంగలిస్తుండగా చూసి తల్లిదండ్రులకు చెబుతానని సహస్ర అనడంతో భయమేసి కత్తితో పొడిచానని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. సహస్ర చెల్లి లాంటిదని, ఎలాంటి తప్పు చేయలేదంటూ బదులిచ్చినట్లు సమాచారం.

News August 24, 2025

వత్సవాయి: రాఖీ కట్టే విషయంలో వివాదం.. మహిళ సూసైడ్

image

సోదరులకు రాఖీ కట్టే విషయంలో చోటుచేసుకున్న వివాదం ఒక మహిళ జీవితాన్ని బలిగొంది. వత్సవాయికి చెందిన రేష్మ మక్కపేటలో నివసిస్తున్న తన సోదరులకు రాఖీ కట్టడానికి వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే, ఈ విషయంలో ఆమెకు భర్తతో గొడవ జరిగింది. ఈ గొడవతో క్షణికావేశంలో రేష్మ ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. సమాజంలో ఇలాంటి ఆత్మహత్యలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

News August 24, 2025

ASF: మునుగోళ్లతో మొక్కులు చెల్లించిన ఆదివాసులు

image

పెంచికలపేట్ మండలం జిల్లెడ గ్రామంలో ఆదివాసులు సాంప్రదాయంగా మునుగోళ్లపై వెళ్లి బొడగ మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణమాసం ప్రారంభంలో వెదురు బొంగులతో తయారు చేసిన మునుగోళ్లపై నడుస్తూ ఉంటారు. అమావాస్య మరుసటి రోజున బొడగ పండగలో భాగంగా మునుగోళ్లతో ఊరి పొలిమేరలోని ఇప్పచెట్టు వద్దకు వెళ్తారు. నైవేద్యాలు సమర్పించి వాటిని అక్కడ వదిలేస్తారు.