News November 20, 2025
HYD: సందీప్ సూసైడ్‌కు కారణమైన నిందితుల ARREST

సందీప్ చావుకి కారణమైన బాలరాజు, హరీశ్‌ను ఈరోజు జవహర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కాప్రా(M) బాలాజీనగర్‌కు చెందిన బాలరాజు, సందీప్ స్నేహితులు. ఇద్దరు దొంగతనాలు చేస్తూ చెడు అలవాట్లకు బానిసయ్యారు. వీరిలో సందీప్ తప్పు తెలుసుకుని చెడు స్నేహం మానేశాడు. కోపంతో బాలరాజు మరో మిత్రుడు హరీశ్‌తో కలిసి సందీప్‌ను కొట్టగా మనస్తాపం చెందిన అతడు గత రాత్రి బ్లేడ్‌తో గొంతు కోసుకుని చనిపోయాడు.
Similar News
News November 21, 2025
ములుగు: సంబురంగా అంతర్జాతీయ బాలల దినోత్సవం

బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా అంతర్జాతీయ బాలల దినోత్సవ కార్యక్రమం కలెక్టరేట్ ఆడిటోరియంలో సంబురంగా జరిగింది. ‘DWO’ రవి అధ్యక్షతన జరగగా అదనపు కలెక్టర్ సంపత్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. బాలలు దేశానికి అమూల్యమైన సంపద అని, వారి భవిష్యత్తే దేశ భవిష్యత్ అన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు అందరూ కృషి చేయాలని కోరారు. బాల కార్మికులు, బాల్యవివాహాల రహితంగా ములుగును తీర్చిదిద్దుతామని తెలిపారు.
News November 21, 2025
ఏటూరునాగారం ఏఎస్పీగా మనన్ భట్

ఏటూరునాగారం ఏఎస్పీగా మనన్ భట్ నియమితులయ్యారు. 2023 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన మనన్ జమ్మూ&కాశ్మీర్‌కు చెందినవారు. ‘UPSC’ ఆల్ ఇండియా 88వ ర్యాంకు సాధించిన ఆయన తెలంగాణ కేడర్ ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్‌లో పనిచేస్తున్నారు. ‘NIT’ శ్రీనగర్‌లో బీటెక్ ఎలక్ట్రానిక్స్, కోజికోడ్ ఐఐఎంలో పీజీ పూర్తి చేశారు.
News November 21, 2025
ములుగు: కొత్త ఎస్పీకి “మేడారం” సవాల్..!

ములుగు జిల్లా ఎస్పీగా నియమితులైన సుధీర్ రాంనాథ్ కేకన్‌కు మేడారం మహా జాతర రూపంలో సమీప దూరంలోనే సవాల్ ఎదురైంది. అయితే ఆయన గతంలో ములుగు ఏఎస్పీగా పనిచేసిన అనుభవం ఉంది. ఆ సమయంలో ఓ మహా జాతర, మినీజాతర ఏర్పాట్లలో ప్రత్యక్షంగా భాగస్వామి అయ్యారు. అప్పటి అనుభవం జనవరిలో జరిగే పెద్ద జాతరలో ఏమేరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఈసారి జాతరలో పోలీస్ చర్యలకు సంబంధించి కసరత్తు జరగగా ఈ ప్రణాళిక కేకన్‌కు హెల్ప్ అవుతుంది.


