News November 19, 2025

HYD: సంధ్య కన్వెన్షన్ కూల్చివేతలపై హైకోర్టు సీరియస్

image

సంధ్య కన్వెన్షన్ కూల్చివేతలపై సంధ్య శ్రీధర్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం హైడ్రా తీరుపై సీరియస్ అయింది. కూల్చివేతలకు అనుమతి ఎవరిచ్చారని కోర్టు ప్రశ్నించింది. ‘కోర్టు ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదు’ అని హైడ్రాను నిలదీసింది. ఈ కేసు తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది.

Similar News

News November 19, 2025

CM చేతుల మీదుగా ఇందిరమ్మ చీర అందుకున్న జిల్లావాసి

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మహిళలకు అందజేస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు పుష్పారాణి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇందిరమ్మ చీరను అందుకున్నారు. సీఎం చేతుల మీదుగా చీర అందుకోవడం తనకు ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.

News November 19, 2025

NGKL: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అలసత్వం వద్దు: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో సంబంధిత శాఖ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ హెచ్చరించారు. జిల్లాలోని పలు మండలాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వెనుకబడి ఉండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండ్‌పై బుధవారం సాయంత్రం సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వివరాలు సేకరించారు.

News November 19, 2025

నాగర్ కర్నూల్ జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

image

✷కొల్లాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
✷తాడూరు మండల నూతన తాహశీల్దార్‌గా రామకృష్ణ
✷జిల్లా డిప్యూటీ ఆరోగ్యశాఖ అధికారిగా శివకుమార్
✷జిల్లావ్యాప్తంగా ప్రారంభమైన పత్తి కొనుగోలు
✷రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించాలని కల్వకుర్తి ఎమ్మెల్యేకు వినతి
✷కల్వకుర్తి: సేవ్ గచ్చుబావి కార్యక్రమంలో విద్యార్థులు
✷కల్వకుర్తి ఆర్టీసీ బస్సు ఢీకొని ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు‌