News December 18, 2024

HYD: సంధ్య థియేటర్ చరిత్ర!

image

సంధ్య థియేటర్‌‌‌ తొక్కిసలాట కేసులో అధికారుల చర్యలపై ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ థియేటర్‌ ట్విన్ సిటీలో ఫేమస్, మాస్ క్రేజ్ ఎక్కువని టాక్. 1980లో సంధ్య70MM, 1981లో సంధ్య 35MM స్థాపించారు. 70MMలో ఆడిన తొలి సినిమా శాలిమార్. నాటి నుంచి లెక్కలేని చిత్రాలు ప్రదర్శించారు. స్టార్ హీరోలకూ ఈ హాల్ సెంటిమెంట్. అటువంటి థియేటర్‌లో రేవతి మృతి చెందారు. ఈ కేసులో షోకాజ్‌ నోటీసులు వెళ్లగా యాజమాన్యం‌ స్పందించాల్సి ఉంది.

Similar News

News February 5, 2025

HYD: బాలికతో అసభ్య ప్రవర్తన.. వ్యక్తికి ఏడాది జైలు శిక్ష

image

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కిరణ్ అనే యువకుడికి ఎల్బీనగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్డు ఏడాది జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. పోలీసుల వివరాలిలా.. సరూర్ నగర్ పరిధికి చెందిన కిరణ్ ఓ బాలికతో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో వేధించాడు. ఈ ఘటన 2020లో జరగ్గా కేసు నమోదైంది. తాజాగా కోర్టు శిక్ష విధించింది. 

News February 5, 2025

త్రిషకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండర్-19 మహిళల వరల్డ్ కప్‌లో రాణించిన క్రికెటర్ గొంగడి త్రిషకు రూ. 1 కోటి, ధృతి కేసరికి రూ. 10 లక్షలు, హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి తలా రూ. 10 లక్షలు నజరానా ప్రకటించారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం త్రిషను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.

News February 5, 2025

గచ్చిబౌలిలో విషాదం.. యువతి సూసైడ్

image

గచ్చిబౌలి సిద్దిక్‌నగర్‌లో బుధవారం విషాద ఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాలు.. ఓ హాస్టల్ పై నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు రిటోజా బసు(22)గా గుర్తించారు. అనారోగ్య సమస్యలతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!