News October 18, 2025
HYD: సంపులో పడి చిన్నారి మృతి.. జర జాగ్రత్త..!

HYD నానక్ రాంగూడలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. టీఎన్జఓ కాలనీలో ఉండే పరమేశ్వర్, సంధ్యారాణి దంపతులకు కుమారుడు నిఖిల్ తేజ(4) ఉన్నాడు. ఈ క్రమంలో అంగన్‌వాడికి వెళ్లిన నిఖిల్ పక్కనే ఉన్న సంపులో ఆడుతూ పడిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో మృతిచెందాడు. కొద్దిసేపు తర్వాత తల్లిదండ్రులు వెతకడంతో సంపులో మృతదేహం లభించింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News October 18, 2025
HYD: ఆటోవాలాకు ‘దీపావళి పండుగ’

బీసీల 42% రిజర్వేషన్ బిల్లుపై హైకోర్టు స్టే విధించడంతో అన్ని పార్టీలు ఏకకంఠంగా తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో ఆర్టీసీ చక్రాలు ఆగిపోయాయి. బస్టాప్‌లు ఆటోలతో కిక్కిరిశాయి. పాఠశాలలు మూతపడి, ఉద్యోగాలు కొనసాగడంతో ఆటోల డిమాండ్ ఆకాశాన్నంటింది. ప్రయాణికులు డబుల్ ఛార్జీకి ఒప్పుకోవాల్సి వచ్చింది. అకస్మాత్తుగా పడిన ఈ అదృష్టంతో ఆటోవాలకు ముందుగానే ‘దీపావళి’ వెలుగొచ్చిందని సంబరపడుతున్నారు.
News October 18, 2025
HYD: బాలికపై అత్యాచారం.. ట్యూషన్ టీచర్‌కు పదేళ్ల జైలు శిక్ష

విద్యార్థినిపై అత్యాచార ఘటనలో ట్యూషన్ టీచర్‌కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ HYD రాజేంద్రనగర్ ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి ఆంజనేయులు తీర్పునిచ్చారు. బాలిక(12) నివసించే ప్రాంతంలో సుబ్రహ్మణ్యేశ్వరరావు దగ్గర రోజు ట్యూషన్‌కి వెళ్లేది. 2017 డిసెంబర్ 3న బాలికపై ట్యూషన్ అయిపోయాక గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు పూర్తి ఆధారాలు సమర్పించడంతో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధించారు.
News October 18, 2025
HYD: జిమ్‌లలో ‘మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్’ దుర్వినియోగంపై చర్యలు

సికింద్రాబాద్‌లోని నామాలగుండులో అక్రమంగా నిల్వచేసి విక్రయించిన ‘మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్’ నిల్వలను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎం.నరేశ్ అనే మెడికల్ వ్యాపారి నుంచి గుండె ఉద్దీపన మందులు-టెర్మిన్ ఇంజెక్షన్లు, టెర్మివా ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. బాడీబిల్డింగ్‌లో దుర్వినియోగం కోసం ఈ మందులను జిమ్‌కు వెళ్లేవారికి చట్టవిరుద్ధంగా విక్రయిస్తున్నారు.