News September 2, 2025
HYD సంస్థానంలో ఆ రక్తపుటేరుకు 78 ఏళ్లు

దేశమంతా స్వేచ్ఛా గాలులు పీల్చుతుంటే.. నాటి HYD సంస్థానం (TG) నిరంకుశత్వంలో నలిగిపోయింది. రజాకార్ల రాక్షసకాండకు వ్యతిరేకంగా సామాన్యులే ఉద్యమాన్ని నడిపారు. దీనికి పరకాల ఘటనే సాక్ష్యం. సరిగ్గా 78 ఏళ్ల క్రితం 1947 SEP 2న అక్కడ జాతీయ పతాకావిష్కరణకు వేలాది మంది ర్యాలీగా బయలెల్లారు. రజాకార్లు విచక్షణారహితంగా వారిపై కాల్పులకు తెగబడగా 16 మంది అమరులయ్యారు. ఇది మరో జలియన్వాలాబాగ్‌ని తలపించింది.
Similar News
News September 2, 2025
HYD: అందుబాటులోకి వచ్చిన హైడ్రా టోల్ ఫ్రీ నంబర్

హైడ్రాకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించడానికి టోల్‌ఫ్రీ నంబర్ 1070 అందుబాటులోకి వచ్చింది. 1070 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేయవచ్చునని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈరోజు తెలిపారు. హైడ్రా ప్రజావాణికి రాలేని వారు చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జాకు గురైతే వెంటనే ఈ నంబర్‌కి కాల్ చేయవచ్చన్నారు.
News September 2, 2025
HYD: శిల్పారామం వేదికగా సందడి చేయనున్న నిఫ్ట్ విద్యార్థులు

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న NIFT (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) విద్యార్థులు శిల్పారామంలో సందడి చేయనున్నారు. ఈనెల 12 నుంచి 17 వరకు తమ ప్రతిభను నిరూపించుకోనున్నారు. భారతీయ హస్తకళల గొప్పదనాన్ని వివరించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. విద్యార్థులు తయారు చేసిన ఫ్యాషన్ దుస్తులు, వస్తువులు ఇక్కడ ప్రదర్శిస్తారు.
News September 2, 2025
HYD: తెలంగాణ ప్రజల బాగోగులే KCRకు ముఖ్యం: సబితాఇంద్రారెడ్డి

కవిత సస్పెన్షన్‌పై మాజీ మంత్రి, మహేశ్వరం BRS ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై, పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించడంతో కవితను సస్పెండ్ చేశారని, ఈ నిర్ణయం హర్షణీయమని ఆమె పేర్కొన్నారు. పార్టీ, తెలంగాణ ప్రజల బాగోగులు తనకు ముఖ్యమని కేసీఆర్ మరోసారి నిరూపించారని అన్నారు. BRSపై ప్రజల్లో మరింత విశ్వాసం నిలబెట్టడానికి ఇలాంటి నిర్ణయాలు అవసరమని ఆమె పేర్కొన్నారు.