News September 11, 2025

HYD: సచివాలయంలో ఇంటర్నెట్ బంద్

image

సచివాలయంలో ఇంటర్నెట్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు శాఖల్లో పనులు స్తంభించాయి. ఉదయం నుంచి ఇంటర్నెట్ నిలిచిపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం నుంచి కేబుల్స్‌ను సిబ్బంది కట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News September 11, 2025

SEP 17న సాయుధ పోరాట దినోత్సవం: MLA

image

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వం సెప్టెంబర్‌ 17న ప్రజాపాలన దినోత్సవం కాకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినోత్సవంగా జరపాలని HYDలో జరిగిన ఓ సమావేశంలో డిమాండ్‌ చేశారు. 1947 SEP 11న పోరాటం ప్రారంభమైందని, ఆ పోరాట యోధుల విగ్రహాలతో మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

News September 11, 2025

గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా ప్రొ.డా.వాణి

image

గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా అడిషనల్ DME ప్రొ.డా.వాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంతవరకు సూపరింటెండెంట్‌గా ఉన్న డా.రాజకుమారి గాంధీ మెడికల్ కాలేజీ ఫిజియాలజీ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తారని అధికారులు తెలిపారు. గాంధీ ఆస్పత్రి పాలనా వ్యవహారాల్లో రోగులు, సిబ్బంది నుంచి వచ్చిన ఆరోపణలు, విమర్శలతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

News September 11, 2025

HYDలో ‘U TURN’ తీసుకున్న ట్రాఫిక్ కష్టాలు

image

సీటీలో యూ టర్న్‌లు ట్రాఫిక్ సమస్యలకు కేంద్రాలుగా మారాయని పలువురు మండిపడుతున్నారు. ఇబ్బందులులేని చోట ట్రాఫిక్ సమస్యలు U TURN తీసుకున్నాయని విమర్శిస్తున్నారు. ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వరకు రష్ టైమ్‌లో యూటర్న్‌ల వద్ద వాహనాలు తిరుగుతుంటే లక్డీకపూల్ వరకు జామ్ అవుతుందని వాపోతున్నారు. నాగోల్‌లో మెట్రో దిగితే ఉప్పల్ వరకు U TURN లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.