News September 19, 2025

HYD: సచివాలయంలో హెల్త్ మినిస్టర్ సమీక్ష

image

HYDలోని తెలంగాణ సచివాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్పత్రుల నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో చర్చ సాగుతోంది. కొత్తగా నిర్మిస్తోన్న ఆసుపత్రులతోపాటు మరికొన్ని ఆస్పత్రులు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News September 19, 2025

BREAKING: HYD: కాలేజీలో అమ్మాయి సూసైడ్

image

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో ఈరోజు విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం శాంతి నగర్‌కి చెందిన తులసి ఘట్‌కేసర్ పరిధి ఏదులాబాద్‌లోని మేఘా ఇంజినీరింగ్ కాలేజీలో డిప్లొమా సీఎస్ఈ రెండో సంవత్సరం చదువుతూ అదే కాలేజీ హాస్టల్‌లో ఉంటుంది. ఈ క్రమంలో హాస్టల్‌లో ఉరేసుకుని చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 19, 2025

జూబ్లీహిల్స్‌లో ఆసక్తికరంగా కాంగ్రెస్ సమీకరణలు..!

image

HYD జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సమీకరణలు ఆసక్తికరంగా మారాయి. శుక్రవారం మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ హామీ పేరుతో కరపత్రాలు దర్శనమిచ్చాయి. దీంతో జూబ్లీహిల్స్‌లో అంజన్ కుమార్ యాదవ్ ప్రచారం ప్రారంభించినట్లు తెలుస్తోంది. అన్ని డివిజన్ల నేతలతో అంజన్ కుమార్ యాదవ్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైకమాండ్ వద్ద నుంచి అంజన్ కుమార్ యాదవ్‌కు సానుకూల సంకేతాలు వచ్చాయని ఆయన అనుచరులు చెబుతున్నారు.

News September 19, 2025

HYD: ఎకో టూరిజం ప్రాజెక్ట్‌ స్క్రీనింగ్ కమిటీ భేటీ

image

HYDలో ఎకో టూరిజం ప్రాజెక్ట్‌ స్క్రీనింగ్ కమిటీ ఈరోజు భేటీ అయ్యింది. ఈ స‌మావేశంలో మంత్రి కొండా సురేఖ పాల్గొని అధికారులకు కీలక సూచనలు చేశారు. పలు ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్ట్‌లపై చర్చ జరుగుతోంది. తెలంగాణ టూరిజాన్ని దేశవ్యాప్తంగా ఫేమస్ చేయాలని, టూరిజం ద్వారానే మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని మంత్రి కొండా సురేఖ తెలిపారు.