News September 19, 2025
HYD: సచివాలయంలో హెల్త్ మినిస్టర్ సమీక్ష

HYDలోని తెలంగాణ సచివాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్పత్రుల నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో చర్చ సాగుతోంది. కొత్తగా నిర్మిస్తోన్న ఆసుపత్రులతోపాటు మరికొన్ని ఆస్పత్రులు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News September 19, 2025
అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: MLA

అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి పోలీసు, రెవెన్యూ, గృహ నిర్మాణం, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా రవాణా చేయాలన్నారు.
News September 19, 2025
ASIA CUP: టాస్ గెలిచిన భారత్

ఒమన్‌తో మ్యాచులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. స్టార్ బౌలర్లు బుమ్రా, వరుణ్ చక్రవర్తికి రెస్ట్ ఇచ్చారు. వారి స్థానంలో హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ జట్టులోకి వచ్చారు.
IND: అభిషేక్, గిల్, సూర్య, తిలక్, సంజూ, దూబే, హార్దిక్, అక్షర్, కుల్దీప్, హర్షిత్, అర్ష్‌దీప్ సింగ్
OMAN: కలీమ్, జతిందర్, హమ్మద్ మిర్జా, వినాయక్, షా ఫైజల్, జిక్రియా, ఆర్యన్ బిస్త్, నదీమ్, షకీల్, సమయ్ శ్రీవాస్తవ, జితెన్ రామనంది.
News September 19, 2025
SRPT: కాలేజీలో అమ్మాయి సూసైడ్

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో ఈరోజు విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం శాంతి నగర్‌కి చెందిన తులసి ఘట్‌కేసర్ పరిధి ఏదులాబాద్‌లోని మేఘా ఇంజినీరింగ్ కాలేజీలో డిప్లొమా సీఎస్ఈ రెండో సంవత్సరం చదువుతూ అదే కాలేజీ హాస్టల్‌లో ఉంటుంది. ఈ క్రమంలో హాస్టల్‌లో ఉరేసుకుని చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.