News October 21, 2025
HYD: సచివాలయానికి ‘కవచం’..!

HYD Dr.BR.అంబేడ్కర్ సచివాలయానికి వచ్చే ప్రతి సామాన్య పౌరుడి నుంచి సీఎం వరకు మానవ ప్రాణాల రక్షణే ఇప్పుడు అతిపెద్ద సవాల్‌గా మారింది. ఇటీవల డ్రోన్లు చక్కర్లు కొట్టడం, నకిలీ ఉద్యోగులు చొరబడటం వంటి ఘటనలతో భద్రతా వలయంపై ఆందోళన నెలకొంది. దీంతో కోట్ల మంది నమ్మకాన్ని నిలబెట్టేందుకు, ప్రమాదాలను తొలిపొరలోనే అడ్డుకునేందుకు ఎక్స్-రే స్కానర్ వ్యవస్థ (X-ray BSS)నిర్వహణకు ప్రభుత్వం రూ.15,95,360 ఖర్చు చేస్తోంది.
Similar News
News October 21, 2025
జూబ్లీహిల్స్: బీజేపీ ర్యాలీలో టీడీపీ జెండాలు..!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీ ఈరోజు భారీగా జరిగింది. అయితే ర్యాలీలో బీజేపీ జెండాలతోపాటు టీడీపీ జెండాలు కూడా దర్శనమిచ్చాయి. పలువురు కార్యకర్తలు టీడీపీ జెండాలు చేతపట్టి ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఆంధ్రలో కూటమిలో భాగమైన బీజేపీ, టీడీపీ, జనేసేన కార్యకర్తలు పాల్గొని లంకల దీపక్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని నేతలు పిలుపునిచ్చారు.
News October 21, 2025
HYD: BRS నేతల మాటలు హాస్యాస్పదం: మంత్రి

మాఫియా, డాన్లు, కాంట్రాక్టులు, కమీషన్ల గురించి BRS నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మంగళవారం HYD గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. బ్లాక్ మెయిలింగ్ చేయడంలో బాల్క సుమన్ దిట్ట అని విమర్శించారు. RS ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ మంత్రుల గురించి మాట్లాడే ముందు KCR పదేళ్ల పాలనపై ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. KCR హయాంలో గురుకులాలు అస్తవ్యస్తంగా అయ్యాయన్నారు.
News October 21, 2025
HYD: సజ్జనార్ సార్.. పోలీసులకు రూల్స్ ఉండవా..?

HYDలో సాధారణ ప్రజలు హెల్మెట్ లేకుండా బైక్‌లు నడిపితే వెంటనే ట్రాఫిక్ పోలీసులు చలానా విధిస్తున్నారు. చలానా పడితే రోడ్డు పక్కన ఆపి తక్షణమే జరిమానా కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. కానీ అదే పోలీసులు స్వయంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న దృశ్యాలు తరచూ నగరంలో కనిపిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ‘సజ్జనార్ సార్ మాకో న్యాయం, పోలీస్‌లకో న్యాయమా?’ అని ప్రశ్నిస్తున్నారు.