News November 6, 2025
HYD: సజ్జనార్ సార్.. GUN FIRED

హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఇవాళ గన్ ఫైర్ చేశారు. నేరస్థుల గుండెల్లో కాదులెండీ తెలంగాణ పోలీస్ అకాడమీలోని బుల్స్‌ఐపై.. అకాడమీలో జరిగిన ఫైరింగ్ ప్రాక్టీస్ సెషన్‌కు సిటీ పోలీస్ బృందంతో కలిసి హాజరయ్యారు. ఫైరింగ్ రేంజ్‌లో ఉండటం ఎప్పుడూ ప్రత్యేక అనుభూతి కలిగిస్తుందని, బుల్స్‌ఐని ఎయిమ్ చేయడం ఎప్పుడూ నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని సీపీ Xలో ట్వీట్ చేశారు.
Similar News
News November 6, 2025
బస్సు దగ్ధమైన ప్రదేశాన్ని పరిశీలించిన ఎస్పీ

పాచిపెంట మండలం పి.కొనవలస ఆంధ్రా- ఒడిశా ఘాట్ రోడ్డులో ఒడిశా ఆర్టీసి బస్సు దగ్ధమైన ప్రదేశాన్ని మన్యం జిల్లా ఎస్పీ ఎస్. వి మాధవ్ రెడ్డి పర్యటించారు. గురువారం సాలూరు టౌన్ సీఐ అప్పలనాయుడు, పాచిపెంట ఎస్సై వెంకట సురేష్‌తో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైవర్, ప్రయాణికులతో మాట్లాడి ప్రమాదం ఎలా జరిగిందనేది కారణాలు తెలుసుకున్నారు.
News November 6, 2025
ఇతిహాసాలు క్విజ్ – 58 సమాధానాలు

1. ధృతరాష్ట్రుడి రథసారథి ‘సంజయుడు’.
2. కంసుడి తండ్రి ‘ఉగ్రసేనుడు’.
3. శశాంకుడు అంటే ‘చంద్రుడు’.
4. విశ్వకర్మ పుత్రిక ‘సంజ్ఞ’.
5. తెలుగు సంవత్సరాలు ‘60’.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 6, 2025
ముగిసిన తొలి విడత పోలింగ్

బిహార్‌లో తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 60.13శాతం పోలింగ్ నమోదైంది. బెగుసరాయ్‌లో అత్యధికంగా 67.32శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పటివరకు క్యూలో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరగనుంది. మొత్తం 243 నియోజకవర్గాలకు గానూ ఇవాళ 121 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఈనెల 11న మరో విడత పోలింగ్ తర్వాత 14న ఫలితాలు వెలువడతాయి.


