News October 21, 2025
HYD: సదర్.. దున్నరాజుకు రూ.31 వేల మద్యం

ముషీరాబాద్‌లో సదర్ ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో కేరళ నుంచి తెచ్చిన 2,500 కిలోల ‘దున్నరాజు’ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఉత్సవంలో యాదవులు రూ.31,000 విలువైన ‘రాయల్ సెల్యూట్’ బాటిల్‌ను దున్నరాజుకు తాగించారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నగరంలో సదర్ ఉత్సవాలు మరింత ఉత్సాహంగా జరుగుతున్నాయి.
Similar News
News October 21, 2025
HYD: ఎన్నికల పరిశీలకులను నియమించిన ఎలక్షన్ కమిషన్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ముగియనుండగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉప ఎన్నికను పరిశీలించేందుకు ముగ్గురు అధికారులను పరిశీలకులుగా నియమించింది. సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారి రంజిత్ కుమార్ సింగ్, పోలీస్ పరిశీలకులుగా ఓం ప్రకాశ్ త్రిపాఠి(IPS), ఇక వ్యయ పరిశీలకులుగా IRS అధికారి సంజీవ్ కుమార్ లాల్ నియమితులయ్యారు.

MBNR: PU స్పాట్ అడ్మిషన్.. నేడే లాస్ట్

పాలమూరు వర్శిటీలో ఎంబీఏ & ఎంసీఏ కోర్సులలో మిగిలినటువంటి సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు వర్శిటీ రిజిస్ట్రార్ పి.రమేష్ బాబు Way2Newsతో తెలిపారు. కన్వీనర్ టీజీ ఐసెట్-2025 క్వాలిఫై ఉండాలని, www.palamuruunivetsity.ac.in వెబ్‌సైట్‌లో ఈనెల 21లోగా దరఖాస్తులు చేసుకుని, 22న ఆయా కళాశాలలో పబ్లికేషన్స్ ఇవ్వాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.