News March 7, 2025
HYD: సన్‌రైజర్స్ అభిమానులకు శుభవార్త

ఈనెల 23న రాజస్థాన్ రాయల్స్, 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ జట్టు తలపడనుంది. ఈ 2 మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో జరిగే రెండు మ్యాచ్‌ల టికెట్లు డిస్ట్రిక్ట్ యాప్‌లో అందుబాటులో ఉంటాయని సన్‌రైజర్స్ ప్రకటించింది. కాగా.. ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ల విక్రయం ఉ.11 నుంచి ప్రారంభంకానున్నాయి.
Similar News
News February 10, 2026
HYD: 1,926 సమస్యాత్మక ప్రాంతాలు: DGP

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. 1,926 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించామని, హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉందన్నారు. 181 ఫ్లయింగ్ స్క్వాడ్స్ సిద్ధం చేశామని, 167 సర్వైలెన్స్ టీమ్స్ విధుల్లో ఉన్నారన్నారు. పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశామన్నారు.
News February 10, 2026
HYD: HCUలో కిటికీ గ్రిల్ తొలగించి ల్యాప్ టాప్ ల చోరీ

HCUలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కిటికీ గ్రిల్ తొలగించి క్లాస్ రూమ్‌లోకి చొరబడి 50 ల్యాప్ టాప్ లను చోరీ చేశారు. భవనంలోని వెనక కిటీకీ గ్రిల్ తొలగించడం, కారు టైర్ల గుర్తులను పోలీసులు గుర్తించారు. యూనివర్సిటీ నలుమూలల ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఘటనపై గచ్చిబౌలి PSలో ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ బాలరాజు తెలిపారు.
News February 9, 2026
రంగారెడ్డిలో నేటితో గప్ చుప్

రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేడు సా.5 గంటలకు ముగియనుంది. దీంతో మైక్‌లు మూగబోనున్నాయి. డప్పుల హోరు.. నేతల ప్రసంగాల జోరుకు బ్రేక్ పడనుంది. కాగా.. ప్రచారానికి ఒక్కరోజే మిగిలి ఉండటంతో ఆదివారం ప్రధాన పార్టీల నేతలు ర్యాలీలతో హోరెత్తించారు. ఆఖరి ఘట్టమైన తాయిలాల పంపిణీకి అంతా సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.


