News March 7, 2025
HYD: సన్‌రైజర్స్ అభిమానులకు శుభవార్త

ఈ నెల 23న రాజస్థాన్ రాయల్స్, 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ జట్టు తలపడనుంది. ఈ 2 మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో జరిగే రెండు మ్యాచ్‌ల టికెట్లు డిస్ట్రిక్ట్ యాప్‌లో అందుబాటులో ఉంటాయని సన్‌రైజర్స్ ప్రకటించింది. కాగా.. ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ల విక్రయం ఇవాళ ఉ.11 నుంచి ప్రారంభంకానుంది.
Similar News
News October 23, 2025
విశాఖ ఎయిర్‌పోర్ట్ వద్ద బస్సు, లారీ ఢీ

విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ సమీపంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అమలాపురం నుంచి విశాఖపట్నం వస్తున్న బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించారు.
News October 23, 2025
అందరికీ ఆదర్శం ఈ కిసాన్ చాచీ

బిహార్‌లోని ముజఫర్‌పుర్ జిల్లా సరేయాకు చెందిన 73 ఏళ్ల రాజకుమారి దేవి ఉత్సాహంగా సైకిల్‌పై ప్రయాణిస్తూ కనిపిస్తారు. గత 20ఏళ్లుగా సైకిల్‌పై వెళ్లి సమీపగ్రామాల్లోని మహిళలకు ఆధునిక వ్యవసాయం, ఊరగాయలు పెట్టడం నేర్పిస్తున్నారామె. ఆమె సేవలకుగానూ 2007లో కిసాన్ శ్రీ, 2019లో పద్మశ్రీ అవార్డులు వరించాయి. తాము ఆర్థికంగా బలపడేందుకు సాయం చేస్తున్న రాజకుమారిని అక్కడివారు ముద్దుగా కిసాన్ చాచీ అని పిలుచుకుంటారు.
News October 23, 2025
సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం 21 కంపార్ట్మెంట్ లలో భక్తులు స్వామి వారి దర్శనానికి వేచి ఉన్నారు. బుధవారం 73,853 మంది స్వామి వారిని దర్శించుకోగా.. 22,551 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 3.47 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.