News September 23, 2025

HYD: సన్ సిటీ‌లో అల్లకాస్ షాపింగ్ మాల్ ప్రారంభం

image

బండ్లగూడ జాగీర్‌లోని సన్ సిటీ సమీపంలో సోమవారం అల్లకాస్ నూతన షాపింగ్ మాల్ ప్రారంభమైంది. అర్ధ శతాబ్దపు అనుభవంతో నాలుగు అంతస్థుల భవనంలో షాపింగ్ మాల్ ఏర్పాటు చేసినట్లు అల్లకాస్ వ్యవస్థాపకుడు సత్యనారాయణ తెలిపారు. హైదరాబాద్ ఫ్యాషన్ ల్యాండ్‌స్కేప్‌ను ఉన్నతీకరించడంలో ఇది ఒక మైలురాయిగా పేర్కొన్నారు. బండ్లగూడలో 200 మందికి పైగా ఉపాధి కల్పిస్తుండటంతో కూడా ఆనందం వ్యక్తం చేశారు.

Similar News

News September 23, 2025

మైథాలజీ క్విజ్ – 14

image

1. రామాయణంలో ‘వాలి’ కుమారుడు ఎవరు?
2. వ్యాసుని ద్వారా దాసి కన్న బిడ్డ ఎవరు?
3. అత్రి మహాముని భార్య ఎవరు?
4. కామాఖ్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది?
5. శ్రీరామనవమి ఏ తెలుగు మాసంలో వస్తుంది?
– సమాధానాలు సాయంత్రం 6 గంటలకు
<<-se>>#mythologyquiz<<>>

News September 23, 2025

మండలి నుంచి వైసీపీ వాకౌట్

image

ఏపీ శాసన మండలి నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. అట్రాసిటీ కేసులపై చర్చ సందర్భంగా ‘మాపై గొడ్డలి వేటు, కోడికత్తి, అమ్మా, చెల్లి కేసులు లేవు’ అని హోం మంత్రి అనిత YCPపై సెటైర్లు వేశారు. దీంతో ఆమె వ్యాఖ్యలకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామంటూ YCP ఎమ్మెల్సీలు బయటికి వెళ్లిపోయారు.

News September 23, 2025

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మహిళా నేతలు

image

విజయవాడ కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి దర్శించుకున్నారు. దర్శనానంతరం వారికి అర్చకులు ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.