News September 15, 2025

HYD: సబ్సిడీ.. అర్హులకు ఎప్పుడు?

image

అర్హులైన వారికి రూ.500కే సిలిండర్లు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కానీ, గ్రేటర్ HYD పరిధిలో సుమారు 60 వేల మందికి పైగా అర్హులకు గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్సిడీ రానివారు ఎక్కడికి పోవాలో తెలియటం లేదని, అధికారులు దీనిపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికీ పలువురు ప్రజాపాలన దరఖాస్తులు పట్టుకొని తిరుగుతున్నట్లు తెలిపారు.

Similar News

News September 15, 2025

ప్రకాశం ఎస్పీ మీకోసంకు 58 ఫిర్యాదులు

image

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 58 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీస్ ఉన్నతాధికారులు, మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీకోసంకు వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు.

News September 15, 2025

జనగామ కలెక్టరేట్లో పట్టణ అభివృద్ధిపై సమీక్ష

image

జనగామ కలెక్టరేట్లో నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గంలోని పలు సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పట్టణంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించేందుకు అదనంగా నిధులు విడుదల చేయాలని, ప్రభుత్వ పథకాలలో తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాలని కలెక్టర్‌కు సూచించారు.

News September 15, 2025

మెదక్: ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు: కలెక్టర్

image

జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు పక్కాగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణపై కలెక్టర్ సమీక్షించారు. మెదక్ బాలికల హై స్కూల్లో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈనెల 22 నుంచి 28 వరకు ఈ పరీక్షలు 6 రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని వివరించారు.