News August 19, 2024

HYD: సమస్యలపై మహిళా కమిషన్ వద్దకు జూడాలు

image

తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారదతో ఉస్మానియా, గాంధీ జూడాలు సమావేశమయ్యారు. వైద్యులకు కావాల్సిన సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లు చేయాలని వినతి పత్రం అందించారు. రాత్రి విధుల్లో ఉండే మహిళా వైద్య సిబ్బందికి, ప్రత్యేక విశ్రాంతి గదులు, టాయిలెట్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జూడాల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.

Similar News

News February 21, 2026

HYD: ముగిసిన మెగా సెమినార్.. తల్లిదండ్రుల హర్షం

image

10th తర్వాత విద్యార్థులు ఏ రూట్‌లో వెళ్తే ఫ్యూచర్ ఉంటుందనే దానిపై తల్లిదండ్రులు స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News & Resonance సంస్థ సంయుక్తంగా కెరీర్ గైడెన్స్ సెమినార్ శనివారం ఉచితంగా నిర్వహించింది. శ్రీనగర్‌కాలనీలోని శ్రీ సత్యసాయి నిగామగమం ట్రస్ట్‌లో CBI Ex. జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేశారు. జేడీ సూచనలు విన్న పేరెంట్స్ సంతృప్తి వక్తం చేశారు.

News February 21, 2026

HYD: ఒక్క రోజు ఛాన్స్.. ఇన్వెస్ట్‌మెంట్ బజార్

image

తెలంగాణ ప్రభుత్వం ఇంధన రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపింది. ఇంధన సామర్థ్య ప్రాజెక్టులను పరుగులు పెట్టించేందుకు TGREDCO ఆధ్వర్యంలో HYDలో ఒకే ఒక్క రోజు “ఇన్వెస్ట్‌మెంట్ బజార్” నిర్వహిస్తున్నారు. ప్రాజెక్ట్ డెవలపర్లు, ఇన్వెస్టర్లు, బ్యాంకర్లను ఒకే వేదికపైకి చేర్చి, కోట్లాది రూపాయల నిధులు సమకూర్చడమే దీని లక్ష్యం. రాయితీలతో కూడిన వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇది ఒక సువర్ణావకాశం.

News February 21, 2026

HYD: TG EAPCET పరీక్షకు 20వేల దరఖాస్తులు

image

TG EAPCET ప్రవేశ పరీక్షకి ఈ రోజు ఇంజినీరింగ్ విభాగానికి 12,770 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించి 7,354 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 2 విభాగాలకు సంబంధించి 19 మంది దరఖాస్తు చేసుకున్నారని కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ రోజు వరకు 20,143 దరఖాస్తుకు వచ్చాయని కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.