News April 14, 2024
HYD: సమ్మర్ టూర్ వెళ్లాలనుకుంటున్నారా?

HYD నగరం నుంచి సమ్మర్ టూర్ వెళ్లాలనుకునే వారికి టూరిజం అధికారులు శుభవార్త తెలిపారు. 5 రోజుల టూర్లో భాగంగా అరకు ప్యాకేజీలో కైలాసగిరి, సింహాచలం, రుషికొండ, సబ్ మెరైన్ మ్యూజియం, వైజాగ్ బీచ్ చూపించనున్నట్లుగా తెలిపారు. ఈ టూర్ వెళ్లేందుకు పెద్దలకు రూ.6,999, పిల్లలకు రూ.5,599 టికెట్ ధర ఉందని పేర్కొన్నారు.
Similar News
News September 11, 2025
HYD నుంచి హైస్పీడ్ రైళ్లు!

HYD నుంచి చెన్నయ్, బెంగళూరు, అమరావతికి వెళ్లాలంటే గంటల కొద్దీ ప్రయాణం చేయాలి. భవిష్యత్తులో ఈ బాధలు తప్పనున్నాయి. సిటీ నుంచి చెన్నయ్, బెంగళూరు, అమరావతికి హైస్పీడ్ రైళ్లు త్వరలో రానున్నాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే చెన్నయ్, బెంగళూరు లైన్లు ఓకే కాగా.. ఇప్పుడు అమరావతి రూట్ మ్యాప్ క్లియర్ అయిందని తెలిసింది. అన్నీ అనుకూలిస్తే ఆ సిటీలకు ఇక రయ్..రయ్..మంటూ వెళ్లడమే.
News September 11, 2025
బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్.. దేశంలో సిటీ టాప్

దేశంలో రోజురోజుకూ బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా నగరంలో ప్రతి లక్ష మంది మహిళల్లో దాదాపు 54 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్) నివేదిక పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది. అధిక రొమ్ము క్యాన్సర్ బాధిత మహిళల నగరాల్లో బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం సిటీలు తరువాత స్థానాల్లో నిలిచాయని ఐసీఎంఆర్ పేర్కొంది.
News September 11, 2025
HYD: దసరా, దీపావళి.. స్టేషన్లలో బందోబస్తు

దసరా, దీపావళి సందర్భంగా లక్షలాది మంది సొంతూళ్లకు వెళతారు. దీంతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి,చర్లపల్లి రైల్వే స్టేషన్ల వద్ద భద్రతా చర్యలు పటిష్టం చేయాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు. ‘వెయిటింగ్ హాల్, ప్లాట్ ఫాం వద్ద నిరంతర తనిఖీలు చేయాలి. ప్రయాణికులను క్యూ లైన్లలో రైళ్లలోకి పంపించాలి. ఎంట్రీ పాయింట్ల వద్ద స్పెషల్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి’’ అని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది.