News April 1, 2026
HYD: ‘సమ్మర్ హాలిడేస్’ వచ్చేశాయ్!

TG ప్రభుత్వం 2026 విద్యాసంవత్సరానికి సంబంధించిన వేసవి సెలవుల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు సెక్రటేరియట్ తెలిపింది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ఆరోగ్యం, భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సెలవుల్లో పిల్లలపై ఓ కన్ను వేసి ఉంచాలని సూచించారు.
Similar News
News April 1, 2026
ఆసిఫాబాద్ జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు!

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో శాంతిభద్రతల దృష్ట్యా ఏప్రిల్ 1 నుంచి 30 వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ నితిక పంత్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించడం నిషిద్ధమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆమె కోరారు.
News April 1, 2026
మంచిర్యాల: అధ్యాపకుడిగా మారిన కలెక్టర్.. విద్యార్థులకు పాఠాలు

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ విద్యార్థులకు పాఠాలు బోధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. బెల్లంపల్లిలోని కేజీబీవీని సందర్శించిన ఆయన, స్వయంగా బోర్డుపై పాఠాలు రాస్తూ విద్యార్థులకు పలు అంశాలను వివరించారు. వారితో ముచ్చటించి ప్రశ్నలు అడిగి ఉత్సాహపరిచారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు.
News April 1, 2026
సలేశ్వరం విధులకు వెళ్తూ హోంగార్డు సూసైడ్

సలేశ్వరం లింగమయ్య జాతర బందోబస్తు విధులకు వెళ్తూ హోంగార్డు బయన్న(45) ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. కొల్లాపూర్ మండలం నార్లాపూర్ చెంచుగూడెంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విధి నిర్వహణకు వెళ్తూ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడంతో సహచర సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


