News February 22, 2026
HYD సరిహద్దులు ఫిక్స్!

HYD మ్యాప్ అధికారికంగా మారిపోయింది. ORR దాటి RRR వరకు అథారిటీ పరిధి విస్తరించింది. 104 మండలాల్లోని 1,355 గ్రామాలు ఇప్పుడు ఈ పరిధిలోకి వచ్చాయి. RRRకి ఇరువైపులా 2 కి.మీ మేర ‘డెవలప్‌మెంట్ బఫర్’ జోన్ అమల్లోకి వచ్చింది. ఇకపై ఇక్కడ గ్రామ పంచాయతీ లేఅవుట్లకు అనుమతి ఉండదు. మొత్తం 10,472 చ.కి.మీ పరిధిలో కఠినమైన HMDA నిబంధనలు అమలు కాబోతున్నాయి. రియల్ ఎస్టేట్ ముఖచిత్రాన్ని మార్చే చట్టబద్ధమైన మార్పు ఇది.
Similar News
News February 22, 2026
WGL: రేపు TG Ed.CET-2026 నోటిఫికేషన్ విడుదల!

తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG Ed.CET-2026) నోటిఫికేషన్ రేపు (సోమవారం) విడుదల కానుంది. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో ఎడ్ సెట్ చైర్మన్ ప్రొఫెసర్ కె.ప్రతాప్ రెడ్డి అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించి, దరఖాస్తుల ప్రక్రియ మరియు పరీక్షా షెడ్యూల్ వివరాలను వెల్లడించనున్నారు. బీఈడీ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు రేపటి నుండి కీలక తేదీల వివరాలను తెలుసుకోవచ్చు.
News February 22, 2026
రాజమండ్రి: అనూరియా కేసులపై ఎంపీ పురందేశ్వరి సమీక్ష

రాజమండ్రిలో నమోదైన అనూరియా కేసులపై ఎంపీ పురంధరేశ్వరి ఆదివారం కలెక్టర్ కీర్తి చేకూరి, డీఎంహెచ్వోలతో ఫోన్‌లో సమీక్షించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆమె, వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. కల్తీ అనుమానాల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులతో తనిఖీలు నిర్వహించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజారోగ్యం విషయంలో ఎటువంటి అలసత్వం వహించవద్దని స్పష్టం చేశారు.
News February 22, 2026
టీమ్ఇండియా 5 వికెట్లు డౌన్

T20WC: సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. తొలుత ఓపెనర్ కిషాన్ డకౌట్ కాగా, మరో ఓపెనర్ అభిషేక్ 15 పరుగులకే వెనుదిరిగారు. తిలక్ వర్మ(1), సుందర్(11) సైతం రాణించలేదు. ఆపై నిలకడగా ఆడుతున్న కెప్టెన్ సూర్య(18) 10వ ఓవర్లో ఔట్ అయ్యారు.


