News October 15, 2025
HYD: ‘సర్కారు చేతికి మెట్రో’.. రేపు కీలక నిర్ణయం

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఈ నెల16న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే సీఎం, సీఎస్ రామక్రిష్ణారావు, మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ తదితరులతో సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ ముగించాలని సీఎం భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తీసుకోనున్నారు.
Similar News
News October 15, 2025
కల్తీ మద్యం.. ఎక్సైజ్ శాఖ కొత్త నిబంధనలు

AP:* క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేశాకే మద్యం అమ్మాలి
* ఎక్సైజ్ సురక్షా యాప్ ద్వారా సీసాపై కోడ్ స్కాన్ చేయాలి
* విక్రయించే మద్యం నాణ్యమైనదని ధ్రువీకరించినట్లు ప్రతి దుకాణం, బార్ల వద్ద ప్రత్యేకంగా బోర్డులు ప్రదర్శించాలి
* ప్రతి దుకాణం, బార్‌లో డైలీ లిక్కర్ వెరిఫికేషన్ రిజిస్టర్ అమలు
* మద్యం దుకాణాల్లో ర్యాండమ్‌గా ఎక్సైజ్ శాఖ తనిఖీలు
* నకిలీ మద్యం గుర్తిస్తే షాపు లైసెన్స్ రద్దు
News October 15, 2025
జగిత్యాల: ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష

ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్లతో మంత్రులు, చీఫ్ సెక్రటరీ, వ్యవసాయ శాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్ష నిర్వహించారు. కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా మౌళిక వసతులు, గన్నీలు, తూకం, శుద్ధియంత్రాలు అందుబాటులో ఉంచాలని, 421 కేంద్రాల్లో 48 గంటల్లో నగదు జమయ్యేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌కు మంత్రులు, అధికారులు సూచించారు.
News October 15, 2025
బ్యూటీపార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్ అంటే?

బ్యూటీపార్లర్లలో కస్టమర్ల మెడను వెనక్కు వంచి ఎక్కువసేపు బేసిన్‌పై ఉంచినప్పుడు కొందరిలో మెడ దగ్గరుండే వెర్టిబ్రల్ ఆర్టరీ అనే రక్తనాళం నొక్కుకుపోతుంది. కొన్నిసార్లు దాని గోడల్లోనూ చీలిక వచ్చి రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. దీన్నే బ్యూటీపార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్ అంటారు. దీనివల్ల తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, చూపు కనిపించకపోవడం, సగం శరీరంలో తిమ్మిర్లు, పక్షవాతం, స్పృహ కోల్పోవడం లాంటి సమస్యలొస్తాయి.