News August 15, 2025
HYD: సహజవనరుల పరిరక్షణ అందరి లక్ష్యం కావాలి: కమిషనర్

సహజ వనరుల పరిరక్షణ అందరి లక్ష్యంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. అలా చేస్తేనే మెరుగైన జీవనం సాధ్యమని చెప్పారు. శుక్రవారం HYDలోని హైడ్రా కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఎ(జి)లో సహజ వనరుల సంరక్షణను ప్రస్తావించారని, దాని ప్రకారమే నగరంలోని గొలుసుకట్టు చెరువుల పరిరక్షణకు హైడ్రా కృషి చేస్తోందని తెలిపారు.
Similar News
News August 15, 2025
GST.. ఏ వస్తువులు ఏ శ్లాబ్‌లోకి..!

<<17416480>>GST<<>>లో రెండే శ్లాబులు ఉంటాయని కేంద్రం ప్రతిపాదించింది. CNBC TV18 ప్రకారం ఏ వస్తువులు ఏ శ్లాబులోకి వస్తాయంటే..
*TVలు, ACలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు 28% నుంచి 18%
*ఆహారం, మెడిసిన్స్, విద్య, నిత్యావసర వస్తువులు 0 లేదా 5%
*వ్యవసాయ పనిముట్లు 12% నుంచి 5%
*ఇన్సూరెన్స్ 18% నుంచి 5% లేదా జీరో
>>SEP/OCTలో GST కౌన్సిల్ దీనిపై నిర్ణయం తీసుకోనుంది.
News August 15, 2025
కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి: సీఐటీయూ

కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరారు. కార్మికుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి పాల్గొన్నారు.
News August 15, 2025
KMR: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం: ఛైర్మన్

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల కోసం ప్రభుత్వం డైట్ ఛార్జీలను 40%, కాస్మెటిక్ ఛార్జీలను 200% పెంచిందని రాష్ట్ర వ్యవసాయ ఛైర్మన్ కోదండ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించే ఉద్దేశంతో మెనూ ఛార్జీలను కూడా గణనీయంగా పెంచామని ఆయన తెలిపారు. ఈ పెంపుదల వల్ల జిల్లాలోని 23,100 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.