News August 15, 2025
HYD: సహజవనరుల పరిరక్షణ అందరి లక్ష్యం కావాలి: కమిషనర్

సహజ వనరుల పరిరక్షణ అందరి లక్ష్యంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. అలా చేస్తేనే మెరుగైన జీవనం సాధ్యమని చెప్పారు. శుక్రవారం HYDలోని హైడ్రా కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఎ(జి)లో సహజ వనరుల సంరక్షణను ప్రస్తావించారని, దాని ప్రకారమే నగరంలోని గొలుసుకట్టు చెరువుల పరిరక్షణకు హైడ్రా కృషి చేస్తోందని తెలిపారు.
Similar News
News August 15, 2025
HYD: అద్భుత రూపంలో శ్రీదుర్గాదేవి అమ్మవారు

HYD ఎల్బీనగర్ పరిధి మన్సూరాబాద్ డివిజన్ శ్రీసాయినగర్ కాలనీలోని శ్రీ దుర్గాదేవి దేవాలయంలో అమ్మవారికి ఈరోజు ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసం నాలుగో శుక్రవారం వేళ అమ్మవారిని గాజులతో అలంకరించారు. నిమ్మకాయల దండ వేశారు. అమ్మవారు భక్తులకు అద్భుతంగా దర్శనమిచ్చారు. మహిళా భక్తులు తెల్లవారుజాము నుంచే వచ్చి దర్శించుకుంటున్నారని ఆలయ కమిటీ ఛైర్మన్ పోచబోయిన గణేశ్ యాదవ్ తెలిపారు.
News August 15, 2025
HYD: తాగునీటి సరఫరా చేసే ముందు పరీక్షలు చేయాలి: MD

HYDలో తాగునీరు సరఫరా చేసే ముందు కచ్చితంగా నాణ్యతను పరీక్షించాలని అధికారులను జలమండలి MD అశోక్ రెడ్డి ఆదేశించారు. ఎక్కడా తాగునీరు కలుషితం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బస్తీలు, లోతట్టు ప్రాంతాలపై మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. క్లోరిన్ బిల్లలను ఇంటింటికీ పంపిణీ చేసి, వాటిని వినియోగించి నీటిని శుద్ధి చేసుకునే తీరుపై అవగాహన కల్పించాలని సూచించారు.
News August 15, 2025
ఎల్బీనగర్‌లో శ్రీకాంతాచారికి నివాళులు

తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి జయంతి సందర్భంగా ఈరోజు HYD ఎల్బీనగర్ చౌరస్తా సమీపంలోని ఆయన విగ్రహానికి BRS నేతలు ఘనంగా నివాళులర్పించారు. MLA దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఉద్యమ వీరుడని కొనియాడారు. ఆయన స్ఫూర్తిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.