News August 24, 2025

HYD: ‘సహస్ర చెల్లి లాంటిది.. తప్పు చేయలేదు: వెంకట్

image

కూకట్‌పల్లిలో సహస్ర హత్య కేసులో పోలీసులు జరిపిన అంతర్గత విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితుడు వెంకట్ వివిధ కారణాలతో డిప్రెషన్‌కు గురైనట్లు గుర్తించారు. బ్యాట్‌ను దొంగలిస్తుండగా చూసి తల్లిదండ్రులకు చెబుతానని సహస్ర అనడంతో భయమేసి కత్తితో పొడిచానని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. సహస్ర చెల్లి లాంటిదని, ఎలాంటి తప్పు చేయలేదంటూ బదులిచ్చినట్లు సమాచారం.

Similar News

News August 24, 2025

యూరియా, ఎరువులు పక్కదారి పట్టొద్దు: CBN

image

AP: ఎరువుల ధరలు పెంచి అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని CM CBN ఉన్నతాధికారులను ఆదేశించారు. వ్యవసాయేతర అవసరాలకు యూరియా తరలిపోకుండా కట్టడి చేయాలన్నారు. ప్రైవేట్ డీలర్లకు ఎరువుల కేటాయింపు తగ్గించి మార్క్‌ఫెడ్ ద్వారానే ఎక్కువగా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విజిలెన్స్ ముమ్మరంగా తనిఖీలు చేయాలన్నారు. యూరియా, ఎరువులు పక్కదారి పట్టకుండా స్టాక్ చెకింగ్ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

News August 24, 2025

ఖైరతాబాద్ మహాగణపతికి స్వాగతం చెప్పేందుకు సిద్ధం

image

వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతికి ఘన స్వాగతం చెప్పేందుకు నగర భక్తులు సిద్ధమయ్యారు. ఈ సంవత్సరం 69 అడుగుల గణనాథుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. సోమవారం నేత్రోనిలం(కంటిపాప అమర్చడం) అనంతరం ఏకదంతుడికి స్వాగత కార్యక్రమలు ప్రారంభమవుతాయి. సాయంత్రం గణపతి ఆగమన్ నిర్వహించేందుకు ఖైరతాబాద్ యూత్ అసోసియేషన్ సిద్ధంగా ఉంది. 11 రోజుల పాటు మహాగణపతికి నగరవాసులను కనువిందు చేయనున్నాడు.

News August 24, 2025

ఆయుధాలు వాడకుండా ఉక్రెయిన్‌పై US ఆంక్షలు!

image

USమేడ్ లాంగ్-రేంజ్ ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్స్‌(ATACMS)ని ఉక్రెయిన్ వాడకుండా అమెరికా ఆపుతోందని WSJ పేర్కొంది. రష్యాపై ATACMS వాడేందుకు US అనుమతి కావాలని షరతు పెట్టినట్లు తెలిపింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపలేకపోయానని ట్రంప్ ఫ్రస్ట్రేషన్‌తో ఉన్న నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం. మరోవైపు రష్యాపై టారిఫ్స్ వేయడం లేదా శాంతి చర్చల నుంచి తప్పుకోవడంపై ఆలోచిస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.