News August 24, 2025
HYD: ‘సహస్ర చెల్లి లాంటిది.. తప్పు చేయలేదు: వెంకట్

కూకట్‌పల్లిలో సహస్ర హత్య కేసులో పోలీసులు జరిపిన అంతర్గత విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితుడు వెంకట్ వివిధ కారణాలతో డిప్రెషన్‌కు గురైనట్లు గుర్తించారు. బ్యాట్‌ను దొంగలిస్తుండగా చూసి తల్లిదండ్రులకు చెబుతానని సహస్ర అనడంతో భయమేసి కత్తితో పొడిచానని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. సహస్ర చెల్లి లాంటిదని, ఎలాంటి తప్పు చేయలేదంటూ బదులిచ్చినట్లు సమాచారం.
Similar News
News August 24, 2025
HYD: గణపతి సేవలో 25 వేల మంది కార్మికులు

వినాయక చవితి అంటేనే పూజలు.. వ్రతాలు..నిమజ్జన కార్యక్రమాలుంటాయి. వీధులు, చెరువుల వద్ద పూజా వస్తువులు, పూలు, ప్రసాదాలు పడేస్తారు. దీంతో ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు జీహెచ్ఎంసీ 25 వేల మంది పారిశుద్ధ్య కార్మికులను రంగంలోకి దింపింది. వీరంతా మూడు షిఫ్టుల్లో విధినిర్వహణలో పాల్గొంటారు. ముఖ్యంగా 29 నుంచి నిమజ్జన వేడుకలు జరుగనుండటంతో చెరువుల వద్ద క్లీనింగ్ కార్యక్రమాలు చేపడతారు.
News August 24, 2025
మేడ్చల్: చివరకు మొండెమే మిగిలింది: డీసీపీ

మహేందర్ రెడ్డి పథకం ప్రకారమే <<17503036>>భార్య స్వాతి<<>>ని హత్య చేశాడని మల్కాజిగిరి డీసీపీ తెలిపారు. మేడిపల్లిలో భార్య హత్య కేసు వివరాలను డీసీపీ వెల్లడించారు. శవాన్ని మాయం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నించాడని, విడతల వారీగా భార్య శరీర భాగాలు బయటకు తీసుకెళ్లి పారేశాడన్నారు. పోలీసులు వెళ్లి చూసేసరికి కేవలం మొండెం మాత్రమే మిగిలిందని, మొండానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
News August 24, 2025
HYD: టాప్- 10 కస్టమర్లను గుర్తించిన వాటర్ బోర్డు

నగరంలో అత్యధికంగా జలమండలి నీటి ట్యాంకర్లను బుక్ చేసిన మొదటి 10 మంది వినియోగదారులను గుర్తించారు. అసలు అన్ని నీటి ట్యాంకర్లు వారు ఎందుకు బుక్ చేసుకుంటున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. గతేడాది అత్యధికంగా 674 వాటర్ ట్యాంకర్లను బుక్ చేసిన సాహితీ ఎంకే రెసిడెన్సీని(ప్రగతినగర్) అధికారులు సందర్శించారు. వారికి ఎండీ అశోక్ రెడ్డి తగు సూచనలు ఇచ్చారు. భూగర్భజలాలు పెంపొందించే చర్యలు తీసుకోవాలని సూచించారు.