News November 21, 2024

HYD: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

image

బిల్డింగ్‌పై నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD మైండ్ స్పేస్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా నవీన్ రెడ్డి (24) పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం 13వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 21, 2024

HYD: రాష్ట్రపతి పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు

image

HYD నగరంలో శుక్రవారం రాష్ట్రపతి పర్యటన ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఎన్ఐఏ నుంచి ఐకియా వరకు, కేబుల్ బ్రిడ్జి నుంచి మీనాక్షి వరకు, మాదాపూర్ నుంచి కొత్తగూడ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలన్నారు.

News November 21, 2024

హైదరాబాద్‌లో పెరుగుతోన్న కాలుష్యం!

image

HYDలో వాయి కాలుష్యం పెరుగుతోంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వివరాల ప్రకారం.. అత్యధికంగా సనత్‌నగర్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 186గా నమోదైంది. జూపార్క్-168, పటాన్‌చెరు-160, బొల్లారం-113, సెంట్రల్ యూనివర్సిటీ-98, కొంపల్లి-90, నాచారంలో 76గా ఉంది. AQI ఇండెక్స్ 100 నుంచి 200 మధ్య ఉంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఇబ్బందులు పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News November 20, 2024

HYD: ఇల్లు కట్టుకునే వారికి GOOD NEWS

image

గ్రేటర్ HYDలో ఇల్లు కట్టుకునే వారికి జలమండలి శుభవార్త తెలిపింది. బిల్డింగ్ పర్మిషన్ కోసం కావాల్సిన వాటర్ ఫీజిబిలిటీ పత్రాన్ని ఇకనుంచి డైరెక్ట్‌గా ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయం నుంచి జారీ చేయనున్నట్లు పేర్కొంది. గతంలో స్థానిక CGM కార్యాలయాలలో జారీ చేసేవారు. కానీ వివిధ కారణాలతో తీవ్ర జాప్యం జరిగేది. దీంతో బిల్డింగ్ నిర్మాణానికి ఆలస్యం అయ్యేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని MD అశోక్ రెడ్డి తెలిపారు.