News August 14, 2024
HYD: సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణకు ఆహ్వానం

మణికొండలోని కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని వివిధ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ సాయి శ్రీమాన్ రెడ్డి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 20వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News January 20, 2026
RR: బ్యాటరీ వీల్ చైర్లు, ల్యాప్‌టాప్స్‌కు అప్లై చేసుకోండి

PWDs సాధికారత, లబ్ధికోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా మహిళలు, శిశువులు, దివ్యాంగులు & వృద్ధుల సంక్షేమ అధికారి శ్రీలత తెలిపారు. దివ్యాంగులకు బ్యాటరీ వీల్ చైర్లు, ట్రై సైకిల్స్, డిగ్రీ విద్యార్థులకు ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ మొదలైన సహాయ ఉపకరణాలను అందిస్తామన్నారు. జనవరి 21 నుంచి జనవరి 30వ తేదీలోపు OBMMS పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాలని సూచించారు.
News January 20, 2026
HYDలో ఫేక్ ట్రాఫిక్ చలాన్ల కలకలం: జాగ్రత్త!

HYDలో నకిలీ ట్రాఫిక్ చలాన్ల మోసాలు పెరుగుతుండటంపై పోలీసులు ప్రజలను హెచ్చరించారు. అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండే ఫిషింగ్ లింక్‌లను నిందితులు SMS ద్వారా పంపుతున్నారు. ఆ లింక్‌లను క్లిక్ చేసి వివరాలు నమోదు చేయగానే బాధితుల బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ప్రభుత్వ సైట్లు ఎల్లప్పుడూ .gov.in లేదా .orgతో ముగుస్తాయని, SMS లింక్‌ల ద్వారా చెల్లింపులు చేయొద్దని అధికారులు సూచించారు.
News January 19, 2026
RR: సర్పంచ్‌లకు ముచ్చింతల్‌లో శిక్షణ

కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 27 వరకు 5 విడతల్లో రంగారెడ్డి జిల్లాలోని 525 మంది సర్పంచులకు 5 రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. సభ్యులకు గ్రామ పంచాయతీల పాలన, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం శంషాబాద్ మండలం ముచ్చింతల్ స్వర్ణభారతి ట్రస్టులోని 2 సమావేశ మందిరాలను సిద్ధం చేశారు.


