News February 27, 2026
HYD: సారూ.. అందెశ్రీకి ఇచ్చే గౌరవం ఇదేనా?

ప్రముఖ కవి, TG గేయ రచయిత అందెశ్రీ మరణించి 108 రోజులు గడిచినా సమాధి కోసం ఒక్క ఇటుక కూడా పెట్టకపోవడం సిగ్గుచేటని జనాలు మండిపడుతున్నారు. TG ఉద్యమానికి స్వరం ఇచ్చిన కవికి కనీస గౌరవం లేకపోవడం దురదృష్టకరమని దుమ్మెత్తిపోస్తున్నారు. పాడె మోసి, స్మృతి వనం కడతామని హామీ ఇచ్చిన సీఎం మాటలు నీటి మూటలయ్యాయని కొందరు పెదవి విరుస్తున్నారు. నెలలు గడుస్తున్నా సమాధి పనులు మొదలుకాకపోవడంపై విమర్శలొస్తున్నాయి.
Similar News
News March 1, 2026
OMG.. HYDలో భారీ LIVE FISH

నగర శివారు కీసరలోని గోషాల వద్దగల చెరువులో భారీ చేప జాలరుల వలకు చిక్కింది. ఓ వ్యక్తి ఆదివారం సరదగా అలా చెరువు వద్దకు వెళ్లాడు. 14కేజీల భారీ చేప చిక్కను కిలోల లెక్కన కొనుగోలు చేశాడు. దీంతో కుటుంబమంతా సంతోషం వ్యక్తం చేస్తుంది. పక్కనే గ్రౌండ్‌లో ఉన్న ప్లేయర్స్, స్థానికులు ఈ చేపను ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. మీరెప్పుడైనా ఇంత పెద్ద చేపను లైవ్‌లో చూశారా?
News March 1, 2026
HYD: నకిలీ ఇన్సూరెన్స్‌లు.. 9 మంది అరెస్ట్

ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల పేర్లతో నకిలీ వాహన బీమా పత్రాలను సృష్టిస్తున్న 9మంది ముఠా సభ్యులను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా నకిలీ పత్రాలు, స్టాంపులు, కంప్యూటర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేశ్ వెల్లడించారు. అవసరంలో ఉన్న వాహనదారులను లక్ష్యంగా చేసుకుని మోసాలు చేస్తున్నారు. ప్రజలు అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే బీమా తీసుకోవాలని పోలీసులు సూచించారు.
News March 1, 2026
HYD: ఇవి కాపాడుకుంటే ₹కోట్లు సంపాదించొచ్చు

ఆరోగ్యమే మహా భాగ్యం అని పెద్దలు చెబుతారు. ఈ సూత్రం ఎప్పటికీ వర్తిస్తుందని HYD జీవన్ దాన్ అధికారులు పేర్కొన్నారు. కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, గుండె కవాటాలు, కిడ్నీలు ₹కోట్లు పెట్టినా దొరకకపోవచ్చని వాటిని పదిలంగా కాపాడుకోవాలని సూచించారు. చెడు అలవాట్ల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ₹లక్షల్లో సేవ్ చేసుకోవచ్చని తెలిపారు. కాగా.. అవయవాలు ఫెయిలైనవారు 4వేల మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.


