News October 2, 2025

HYD: సారొచ్చారు.. సంబరం తెచ్చారు!

image

దసరా.. తెలంగాణ పల్లెల్లో పెద్ద పండుగ. CM నుంచి సామాన్యుడి దాక సంబరాలు చేసే రోజు ఇది. ఆ ఊళ్లో మాత్రం ఈసారి నిరుడు లెక్క లేదు. సార్ వచ్చారని సంబరం అంబరాన్ని అంటింది. దసరా సందర్భంగా DGP హోదాలో శివధర్ రెడ్డి తన సొంతూరైన ఇబ్రహీంపట్నం మం. తులేకలాన్‌(పెద్దతుండ్ల)కు వెళ్లారు. DGP గ్రామానికి రావడం ఆర్భాటమైతే.. మన ఊరు నుంచి DGP వరకు ఎదిగారన్న ఆనందం మరోవైపు కనిపించింది. అంతా ఆయన్ను చూసి మురిసిపోయారు.

Similar News

News October 3, 2025

నేడు CM చేతుల మీదుగా ఫలక్‌నుమా ROB ప్రారంభం

image

పాతబస్తీ వాసులకు శుభవార్త. నేడు ఫలక్‌నుమా ROB CM రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభంకానుంది. రూ.52.03 కోట్లతో 360.0 మీటర్ల పొడవులో GHMC, SCR సంయుక్తంగా దీనిని నిర్మించింది. బర్కస్ నుంచి చార్మినార్ రూట్‌తో పాటు ఫలక్‌నుమాలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో ROB ఉపయోగపడుతుంది. ఉదయం 9:15 నిమిషాలకు CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, ఇన్‌ఛార్జీ మంత్రులు, MP అసదుద్దీన్ ఒవైసీతో కలిసి ప్రారంభించనున్నారు.

News October 2, 2025

హైదరాబాద్: మూసీ అందాలు కనువిందు చేసేలా!

image

మూసీ నది అందాలు కనువిందు చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. నగరంలో మూసీ నది దాదాపు 55 కిలోమీటర్ల మేర విస్తరించింది. ముందుగా 20.5 కిలోమీటర్లను సుందీకరించనున్నారు. ఇందుకు దాదాపు రూ.5,641 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు (9.5KM), ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ (11 KM) వరకు సుందరీకరించనున్నారు. త్వరలో ఈ పనులు ప్రారంభం కానున్నట్లు తెలిసింది.

News October 2, 2025

జూబ్లీహిల్స్ బరిలో జయసుధ?

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. రోజుకో నేత పేరు తెర మీదికి వస్తుండడంతో శ్రేణుల్లో అయోమయం నెలకొంది. తాజాగా BJP నుంచి మాజీ ఎమ్మెల్యే, సినీనటి జయసుధ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆమె స్టేట్ చీఫ్ N.రాంచందర్‌రావు భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఇక్కడ BJP నుంచి లంకల దీపక్ పోటీ చేశారు. ఆయన పేరు కూడా సెగ్మెంట్‌లో వినిపిస్తోంది.