News July 8, 2025

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్..51% పనులు పూర్తి.!

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 51 శాతం పనులు పూర్తయినట్లు SCR GM సందీప్ మాథూర్ తెలియజేశారు. ఎక్కడికక్కడ క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ పరీక్షలు చేత నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాధ్యమైనంత తక్కువ సమయంలో పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.

Similar News

News July 8, 2025

నాంపల్లిలో ఏసీబీకి చిక్కిన కమర్షియల్ ట్యాక్స్ అధికారి

image

GST రిజిస్ట్రేషన్ కోసం రూ.8 వేలు లంచం డిమాండ్ చేసిన మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ సుధారెడ్డి ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నాంపల్లి గగన్ విహార్‌లోని కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు దాడుల చేశారు. కంపెనీ అభ్యర్థనపై రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం లంచం కోరినట్లు గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 8, 2025

AP NEWS ROUNDUP

image

* మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జిల్లా పరిధిలోనే అని CM చంద్రబాబు మరోసారి క్లారిటీ ఇచ్చారు.
* విశాఖలో ఇన్నోవేషన్ క్యాంపస్‌ స్థాపనకు ANSR సంస్థతో ఒప్పందం కుదిరిందని మంత్రి లోకేశ్ తెలిపారు. ఐదేళ్లలో 10 వేలమందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.
* YCP నేత ప్రసన్నకుమార్‌రెడ్డిపై MLA ప్రశాంతిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
* ప్రపంచంలోనే AP లిక్కర్ స్కాం అతిపెద్ద కుంభకోణమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

News July 8, 2025

జీరో కేలరీలు ఉండే షుగర్ మొక్క.. ఇంట్లోనే పెంచుకోవచ్చు!

image

షుగర్‌ కంటే దాదాపు 300రెట్లు ఎక్కువ తీపిని కలిగి ఉండే మొక్క ఒకటుంది. అదే ‘స్టీవియా రెబౌడియానా’. దీని ఆకుల నుంచి స్టీవియాను(స్వీట్నర్) తీస్తారు. ‘స్వీట్ లీఫ్’ అని పిలిచే వీటి ఆకులలో స్టీవియోసైడ్ & రెబౌడియోసైడ్ వంటి సమ్మేళనాలు అధిక తీపిని కలిగి ఉంటాయి. ఇందులో కేలరీలు ఉండవని అధ్యయనాలు సూచిస్తున్నాయి. షుగర్ ఫ్రీ ఉత్పత్తుల్లో దీనిని వాడుతుంటారు. నర్సరీ/ఆన్‌లైన్‌లో లభించే వీటిని ఇళ్లలోనూ పెంచుకోవచ్చు.