News November 11, 2025

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. టార్గెట్ DEC 2026

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. టార్గెట్ డిసెంబర్ 2026 అని GM సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ తెలిపారు. అందుకు అనుగుణంగా పనుల్లో వేగం పెంచి ముందుకు వెళుతున్నట్లు వివరించారు. రూ.714 కోట్లతో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టు, ప్రస్తుతం వెయిటింగ్ హాల్ నిర్మాణాలు, లాంగ్ స్పేస్, ఆర్కేడ్ నిర్మాణపు పనులు పూర్తయ్యాయి.

Similar News

News November 11, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: 3PM UPDATE.. 40.20% ఓటింగ్ నమోదు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచి ప్రతి 2 గంటలకు సగటున 10 శాతం ఓటింగ్ నమోదు అవుతూ వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 31.94% పోలింగ్ ఉండగా.. లంచ్‌ టైమ్‌ తర్వాత కూడా అదే విధంగా సాగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 40.20 శాతం నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు ఎంతమేర పోలింగ్ పెరుగుతుందో వేచి చూడాలి.

News November 11, 2025

పాలమూరు: ఈనెల 15న ‘బ్యాడ్మింటన్’ ఎంపికలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, 17 విభాగంలో బాల, బాలికలకు బ్యాడ్మింటన్ ఎంపికలను నిర్వహించనున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ఒక ప్రకటనలో తెలిపారు. MBNRలోని DSA స్టేడియంలో ఈ నెల 15న ఎంపికలు ఉంటాయని, ఒరిజినల్ మెమో, బోనఫైడ్, ఆధార్‌లతో ఉ. 9:00 గంటలలోపు పీడీ సాధాత్ ఖాన్‌కు ప్రతి పాఠశాల నుంచి ముగ్గురు(సింగిల్స్ & డబుల్స్) చొప్పున రిపోర్ట్ చేయాలన్నారు.

News November 11, 2025

NLG: 13 నుంచి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు

image

నల్గొండ మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయం UG I,III,V సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు నవంబర్ 13 నుంచి డిసెంబర్ 1 వరకు నిర్వహించనున్నారు. I సెమిస్టర్ 5400, III సెమిస్టర్ 5830, V సెమిస్టర్ 5597 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. నల్గొండ జిల్లాలో 12, సూర్యాపేట జిల్లాలో 09, యాదాద్రి భువనగిరి జిల్లాలో 09 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పరీక్షల కంట్రోలర్ డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు.