News March 25, 2026
HYD: సిటీని ఊపేస్తున్న కొత్త ట్రెండ్ ఇదే!

నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో Gen-Z మొదలుపెట్టిన కిర్రాక్ ట్రెండ్ సిటీని ఊపేస్తోంది. నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో ప్లేట్లు పక్కనపెట్టి Cake in a Can పట్టుకుని రీల్స్ చేసిన కుర్రాళ్ళు.. ఇప్పుడు ఆ ట్రెండ్‌ని సిటీలోని పాప్-అప్ స్టాల్స్, ఇన్ఆర్బిట్ మాల్‌లోని ‘స్ట్రాబెర్రీ కార్నివాల్స్’కి షిఫ్ట్ చేశారు. స్ట్రాబెర్రీ ట్రీట్స్‌తో ‘Strawberry Stories’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే అది అసలైన ‘వైబ్’ అంటున్నారు.
Similar News
News April 20, 2026
కొడంగల్: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్‌తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.

HYDలో త్వరలో మరో IVF సెంటర్

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్‌డ్ వైద్యం అందించనున్నారు.