News August 25, 2025

HYD: సీఎంకు ఇంత భయం ఎందుకు?: RSP

image

HYD ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రాక నేపథ్యంలో ఇనుప కంచెలు ఏర్పాటు చేయడంపై BRS నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రికి విశ్వ విద్యాలయం లోపలికి పోవాలంటే ఇంత భయమెందుకని ప్రశ్నించారు. ఈ కనీవినీ బందోబస్తు ఎందుకు? విద్యార్థులేమైనా ఉగ్రవాదులా? అని నిలదీశారు.

Similar News

News August 25, 2025

నగరంలో లాగింగ్ పాయింట్లు 3 రెట్లు పెరిగాయి

image

నగరంలో వర్షం వస్తే బయటకు వెళ్లాలంటేనే భయం. కారణం వాటర్ లాగింగ్ పాయింట్లు HYDలో పెరగడం గతంలో వాటర్ లాగింగ్ పాయింట్లు 144 ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 436కు పెరిగినట్లు తేలింది. దీంతో అధికారుల్లో ఒక రకమైన ఆందోళన, అన్ని చోట్లా నీరు నిలిచిపోతే నగరం ఏమైపోతుందన్న భయం.. ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారుల సర్వేలో ఈ వివరాలు తెలిశాయని సమాచారం.

News August 25, 2025

దేశంలోనే TG హైకోర్టు టాప్.. 9వ స్థానంలో ఏపీ

image

మహిళా న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు దేశంలోనే టాప్ ప్లేస్‌లో నిలిచింది. 33.3% మహిళా జడ్జీలు ఇక్కడ సేవలందిస్తున్నారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో మొత్తం 30 మంది జడ్జీలు ఉండగా 10 మంది అంటే 33.3% మంది మహిళా జడ్జిలు ఉన్నారు. అదే ఏపీలో 30 మందికి గానూ 16.67 % అంటే ఐదుగురే ఉండటంతో జాబితాలో 9వ స్థానంలో నిలిచింది. సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసర్చ్ నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది.

News August 25, 2025

HYD: త్వరలో సీఎంల కీలక సమావేశం?

image

తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి త్వరలో భేటీ కానున్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేకు సంబంధించి ఇద్దరు మాట్లాడనున్నట్లు సమాచారం. రోడ్ అలైన్‌మెంట్, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల విషయాలు చర్చించనున్నారు. వీరి చర్చలు ఓకే అయితే.. ఆ నివేదికను కేంద్రానికి పంపి అనుమతి కోరనున్నట్లు తెలిసింది.