News November 20, 2025

HYD: సీఎంను కలిసిన జలమండలి ఎండీ

image

జల సంరక్షణలో జల్ సంచయ్ జన భాగిదారి జాతీయ అవార్డును అందుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఈరోజు HYDలో మర్యాదపూర్వకంగా కలిశారు. జలమండలి దేశంలోని అన్ని మున్సిపాలిటీలతో పోటీపడి అవార్డును సొంతం చేసుకోవడంతో అశోక్ రెడ్డిని సీఎం అభినందించారు. జల సంరక్షణలో జలమండలి చేపడుతున్న కృషికిగాను అవార్డును అందుకోవడం గర్వంగా ఉందన్నారు.

Similar News

News November 23, 2025

గుంటూరులో నాన్ వెజ్ ధరలు ఇవే.!

image

గుంటూరులో నేటి నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ ధర కేజీ రూ.200, విత్ స్కిన్ రూ.180గా విక్రయిస్తున్నారు. మటన్ కేజీ ధర రూ.1050 పలుకుతోంది. ఇక చేపలు బొచ్చెలు, రాగండి ఇలా రకాలను బట్టి కేజీ రూ.200 నుంచి రూ.280 వరకు విక్రయాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు మీ ప్రాంతాల్లో నాన్ వెజ్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News November 23, 2025

నోబెల్ వచ్చినా దేశం దాటలేని పరిస్థితి

image

ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి విన్నర్ వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. డిసెంబర్‌ 10న నార్వేలో జరిగే నోబెల్ పురస్కారాల వేడుకకు హాజరైతే, ఆమెను పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని ఆ దేశ అటార్నీ జనరల్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, ప్రజల హక్కుల కోసం పోరాటం చేసినందుకు ఆమెకు నోబెల్ బహుమతి ప్రకటించినప్పటికీ, దేశం బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

News November 23, 2025

హైదరాబాద్ NGRIలో ఉద్యోగాలు

image

HYDలోని CSIR-NGRI 3 ప్రాజెక్ట్ అసోసియేట్, అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 27వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BSc, MSc, M.Tech (జియో ఫిజిక్స్, అప్లైడ్ జియోఫిజిక్స్, ఎర్త్ సైన్సెస్, మెరైన్ జియోఫిజిక్స్), MS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. NOV 28, DEC 3 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. https://www.ngri.res.in/