News January 3, 2025
HYD: సీఎం రేవంత్ రెడ్డి నేటి షెడ్యూల్
నేడు సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉండనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్ జల మండలి బోర్డు మీటింగ్‌కి హాజరవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సెక్రెటేరియట్‌లో రీజనల్ రింగ్ రోడ్డు, ఆర్ అండ్ బీ, నేషనల్ హైవే ప్రాజెక్టులపై అధికారులతో సీఎం సమీక్ష ఉండనుంది.
Similar News
News January 5, 2025
HYD: KBR పార్క్ ఎంట్రీ ఫీజు పెంపు
బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ ఎంట్రీ ఫీజును పెంచుతూ అటవీశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కేబీఆర్ పార్క్ వార్షిక ఎంట్రీ పాస్ జనరల్ కేటగిరికి గతంలో రూ.3,100 ఉండగా రూ.3,500, సీనియర్ సిటిజన్స్‌కు రూ.2,100 ఉండగా రూ.2,500లకు పెంచారు. తమ పాసులను 31 తర్వాత www.kbrnp.inలో రెన్యువల్ చేసుకోవాలని, పాఠశాల వార్షిక ఎంట్రీ పాసులను కూడా ఆన్‌లైన్‌లో రెన్యువల్ చేసుకోవాలని సూచించారు.
News January 5, 2025
హైదరాబాద్ జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా
HYD జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. వెస్ట్ మారేడ్‌పల్లిలో 13℃, సులేమాన్‌నగర్ 13.7, షేక్‌పేట 13.8, ముషీరాబాద్ 14.2, కంటోన్మెంట్ 14.4, గోల్కొండ 14.6, లంగర్‌హౌస్ 14.6, ఆసిఫ్‌నగర్ 14.8, చాంద్రయాణగుట్ట 14.9, మోండామార్కెట్ 15.1, రియాసత్‌నగర్ 15.1, విజయనగర్‌కాలనీ 15.2, అహ్మద్‌నగర్ 15.7, గౌలివాడ 15.8, తిరుమలగిరి 15.9, జూబ్లీహిల్స్ 15.9, మెహదీపట్నం 16.2, పాటిగడ్డలో16.2℃గా నమోదైంది.
News January 5, 2025
సైబరాబాద్‌ను సురక్షితంగా మార్చాలి: CP
ప్రజా సమస్యలను సమర్థంగా పరిష్కరించేలా ప్రమాణాలు రూపొందించాలని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మరింత ఉన్నత లక్ష్యాలను చేరుకోవడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. ప్రజలు సురక్షితంగా నివసించే ప్రాంతంగా సైబరాబాద్‌ను మార్చాలన్నారు.