News April 1, 2024

HYD: సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు: ఈటల

image

ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు ఉండాలని గతంలో ఎంపీగా రేవంత్‌రెడ్డిని గెలిపిస్తే.. ఇప్పుడు సీఎం అయిన తర్వాత ప్రతిపక్షాలపై కేసులు పెట్టి గొంతు నొక్కుతున్నారని బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. HYD నాగారంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై ఈటల మాట్లాడారు. దేశంలో బీజేపీ గాలి వీస్తుందని, మూడోసారి మోదీ హ్యాట్రిక్ విజయం సాధించి అధికారంలోకి రావడం పక్కా అని అన్నారు.

Similar News

News March 6, 2026

HYD: సివిల్స్‌లో సత్తా చాటిన ఉమ్మడి రంగారెడ్డి బిడ్డలు

image

సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అభ్యర్థులు సత్తా చాటారు. రాష్ట్రం నుంచి ఎంపికైన మొత్తం 20 మందిలో 8 మంది మన జిల్లాలకు చెందిన వారే కావడం విశేషం. లక్ష్మిరచన 178వ ర్యాంక్, మెరుగు కౌశిక్ 399, ప్రీతీ రాపర్తి 468, విక్రమ్ సింహా రెడ్డి 682, విజయ్ సింహా రెడ్డి 682, శ్రీరామ్ హర్ష 823, ప్రత్యూష 908, దీపక్ శర్మ 951, ఉత్తమ ర్యాంకులు సాధించారు.

News March 6, 2026

గచ్చిబౌలి: గ్యాస్‌ బెలూన్‌ పేలి నలుగురికి గాయాలు

image

గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్‌ శాంతి సరోవర్‌ ప్రాంగణంలో శుక్రవారం గ్యాస్‌ బెలూన్‌ పేలి నలుగురు గాయపడ్డారు. ఓ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన హీలియం బెలూన్‌ ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

News March 6, 2026

HYD: ఫైల్ కదలాలంటే సమర్పించుకోవాల్సిందే..!

image

సికింద్రాబాద్ GHMC ఆఫీసులో అకౌంట్స్ ఎగ్జామినర్ సంతోష్ ఓ పెన్షనర్ దగ్గర రూ.35వేలు లంచం తీసుకుంటూ ACBకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన విషయం తెలిసిందే. కాగా ఇది చిన్న శాంపిల్ మాత్రమే. ఇంజినీరింగ్ విభాగంలో 30శాతం కమీషన్ల దందా నడుస్తోందనే ఆరోపణలున్నా కేవలం చిన్న క్లర్కులను పట్టుకొని హడావిడి చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వందల కోట్ల ఆస్తులు వెనకేసిన పెద్ద ఆఫీసర్ల ఫైళ్లు మాత్రం బీరువాల్లోనే మగ్గుతున్నాయి.