News August 29, 2025

HYD: సీఎస్ పదవీకాలం 7నెలలు పొడిగింపు

image

తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం 7నెలలు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన 2026 మార్చి వరకు CSగా కొనసాగనున్నారు. కాగా 2025 మేలో ఆయనను తెలంగాణ CSగా ప్రభుత్వం సిఫారసు చేయగా.. కేంద్రం ఆమోదించింది. ఆయన పదవీకాలం ఈనెల 31తో ముగియనుండగా.. మరి కొంతకాలం పొడగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇటీవల లేఖ రాయగా దానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

Similar News

News September 1, 2025

HYD: 9 రోజులుగా దొరకని అవయవాలు

image

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బోడుప్పల్‌లో గత నెల 24న భర్త హత్య చేసి, ముక్కలుగా మార్చి మూసీలో పడేసిన స్వాతి అవయవాలు ఇప్పటికీ లభించలేదు. 9 రోజులుగా DRF, హైడ్రా బృందాలు ప్రతాపసింగారం మూసీ వంతెన వద్ద జల్లెడ పట్టినా ఫలితం శూన్యమైంది. మూసీలో ఎక్కడా ఆనవాళ్లు కనిపించకపోవడంతో దర్యాప్తు మరింత క్లిష్టమైంది. గాలింపు యత్నాలు ఫలించకపోవడంతో కేసు సవాలు అవుతోంది.

News September 1, 2025

HYD: బీజేపీ నాటకంలో రేవంత్ రెడ్డి కీలుబొమ్మ: BRS MLA

image

బీజేపీ ఆడిస్తున్న నాటకంలో సీఎం రేవంత్ రెడ్డి కీలుబొమ్మగా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుందని కుత్బుల్లాపూర్ BRS ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించడం, రేవంత్ రెడ్డి చేసే పనితీరు తదితర విషయాలన్నీ గమనిస్తే ఇది తేటతెల్లమవుతున్నట్లుగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదన్నారు.

News September 1, 2025

HYD వ్యాప్తంగా ఆర్టీసీ కార్గో సర్వీస్ హోమ్ డెలివరీ

image

HYD వ్యాప్తంగా ఆర్టీసీ కార్గో సర్వీస్ హోమ్ డెలివరీ చేస్తున్నట్లుగా రాష్ట్ర IPRD తెలిపింది. కేజీ వరకు బరువు కలిగిన పార్సెల్ రూ.50కు మాత్రమే HYD వ్యాప్తంగా డెలివరీ చేస్తున్నట్లుగా వివరించింది. ఆర్టీసీ కార్గో హోమ్ డెలివరీ సంబంధించి ఆర్టీసీ వెబ్‌సైట్, ఆర్టీసీ కార్గో సర్వీస్ సెంటర్లను సందర్శిస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు.