News February 4, 2026
HYD: సీక్రెట్ బేస్‌మెంట్లలో కొత్త మ్యూజిక్

సిటీ అంతా రీల్స్ గోలలో ఉంటే, కొందరు మాత్రం సీక్రెట్ బేస్‌మెంట్లలో కొత్త మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పార్టీల లొకేషన్ గంట ముందే వాట్సాప్‌లో వస్తుంది. తెలుగు డిస్కో నుంచి టెక్నో దాకా కొత్త ప్రయోగాలు ఇక్కడ వినొచ్చు. మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూనే, మధ్యలో చుట్టాల పెళ్లిళ్ల కోసం షేర్వానీలు మార్చుకుని సిటీలోని ఫంక్షన్ హాళ్లలోకి జారిపోయే వింత సంస్కృతి వీరిది.
Similar News
News February 5, 2026
తినేటప్పుడు ఇలా చేస్తున్నారా?

ఆహారపు అలవాట్లు ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. దంపతులు ఒకే ప్లేట్‌లో భోజనం చేయకూడదు. దీనివల్ల కుటుంబంలోని ఇతర సభ్యుల పట్ల వివక్ష, అసూయ పెరిగే ఛాన్సుందని పండితులు చెబుతున్నారు. మంచం మీద కూర్చుని తింటే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుందట. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని నమ్మకం. నేలపై కూర్చుని తింటే సుఖసంతోషాలు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
News February 5, 2026
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. ప్రారంభంలో సెన్సెక్స్ సుమారు 250 పాయింట్లు తగ్గి 83,571కు చేరగా, నిఫ్టీ 87 పాయింట్లు క్షీణించి 25,689 వద్ద ట్రేడ్ అయ్యింది. గ్లోబల్ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో పాటు టెక్ షేర్ల నష్టాలు మార్కెట్‌పై ప్రభావం చూపాయి. రియల్టీ, ఫార్మా షేర్లు నష్టాల్లో ఉండగా, ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి.
News February 5, 2026
జి.యర్రంపాలెంలో పులి పంజా.. దూడలు మృతి!

రాజానగరం మండలం జి.యర్రంపాలెంలో పులి దాడి చేసి రెండు దూడలను చంపివేసిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న MLA బత్తుల బలరామకృష్ణ గురువారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అటవీ అధికారులతో మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు. ప్రజలు భయాందోళనలో ఉన్నారని, వెంటనే పులిని బంధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.


