News October 14, 2025

HYD: సీజనల్ వ్యాధుల నియంత్రణపై హెల్త్ మినిస్టర్ సమీక్ష

image

రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల పనితీరు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై మంత్రి దామోదర రాజనరసింహ HYDలోని సెక్రటేరియట్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈఏడాది డెంగీ 2,900, మలేరియా 209, టైఫాయిడ్ 4,600, చికున్‌గున్యా249 కేసులు నమోదవగా గతంతో పోల్చితే గణనీయంగా తగ్గాయని మంత్రికి వివరించారు. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల ప్రబలే వ్యాధులు,తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.

Similar News

News October 14, 2025

HYD: నిజాం కళాశాల.. CPR వారోత్సవాలు

image

హైదరాబాదులోని నిజాం కళాశాలలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో CPR అవగాహన వారోత్సవాలు ప్రారంభించారు. ఈనెల 17 వరకు నిర్వహించనున్నారు. డా.రాజ్ భారత్, డా.సతీశ్ ట్రైనర్ అర్విందా ఆధ్వర్యంలో CPR ప్రదర్శన ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడంలో అవసరమైన నైపుణ్యాన్ని చూపించింది. నిజాం కళాశాల ప్రిన్సిపల్ ప్రొ. ఏ.వి.రాజశేఖర్ ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News October 14, 2025

KNR: రోడ్డు ప్రమాదం.. పోతిరెడ్డిపేటవాసి మృతి

image

హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చింత సమ్మయ్య గౌడ్(45) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గ్రామ సబ్‌ స్టేషన్ సమీపంలో రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సమ్మయ్య గౌడ్ అక్కడికక్కడే మరణించగా.. మరొకరు గాయపడ్డారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ దుర్ఘటన పోతిరెడ్డిపేటలో విషాదాన్ని నింపింది.

News October 14, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. మహిళల ఓట్లే కీలకం..!

image

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పురుషుల ఓట్లు వివిధ పార్టీలకు డివైడ్ అయ్యే అవకాశం ఉన్నా మహిళల ఓట్లు మాత్రం ఒకే పార్టీకి గంప గుత్తగా పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం 3,98,982ఓటర్లు ఉండగా అందులో 1,91,590మంది మహిళా ఓటర్లే ఉన్నారు. కాగా ఫ్రీబస్సు స్కీమ్‌తో‌ మహిళలు తమకే ఓట్లు వేస్తారని కాంగ్రెస్ నేతలు అంటుండగా గతంలో బతుకమ్మ చీరలిచ్చిన KCRవైపే మహిళలు ఉన్నారని BRSనేతలు చెబుతున్నారు.