News December 9, 2024
HYD: సీసీటీవీల నిర్వహణకు నిధులు కేటాయిస్తాం: బిర్లా గ్రూప్
రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో నేర నియంత్రణ కోసం సీసీటీవీల నిర్వహణకు నిధులు కేటాయిస్తామని ఆదిత్య బిర్లా గ్రూపు వైస్ ఛైర్మన్ రాజశ్రీ తెలిపారు. రాచకొండ సీపీ సుధీర్ బాబుతో సోమవారం రాజశ్రీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనరేట్ భౌగోళిక పరిస్థితులు, నేర నియంత్రణ విధానాలు, షీ టీమ్స్ పనితీరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 26, 2024
జనవరి 3న బీసీ విద్యార్థులతో కలెక్టరేట్ల ముట్టడి: ఆర్.కృష్ణయ్య
16.75 లక్షల మంది విద్యార్థుల ఫీజుల బకాయిలు చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యకుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం బషీర్‌బాగ్‌లో వేముల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల స్కాలర్‌షిప్, ఫీజురీయంబర్స్‌మెంట్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి జనవరి 3న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడించనున్నట్లు తెలిపారు.
News December 26, 2024
HYD: ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్‌ను ఖండించిన KTR
BRS రాష్ట్ర నేత <<14984793>>ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను<<>> పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ఎన్నికల ప్రచారంలో దళిత, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారని, కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. BRS పార్టీకి కేసులేమి కొత్త కాదన్నారు.
News December 26, 2024
HYD: ఫిబ్రవరి 3న లక్ష డప్పుల మహాప్రదర్శన
ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకురావాలని 2025, ఫిబ్రవరి 3న HYDలో జరిగే వెయ్యి గొంతులు, లక్ష డప్పుల మహాప్రదర్శనను విజయవంతం చేయాలని గురువారం MRPS, MSF, MSP అనుబంధ సంఘాల కార్యవర్గ సభ్యులు కోరారు. దీనికి సంబంధించిన సమావేశాన్ని గురువారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లోతుకుంటలోని శుభశ్రీ గార్డెన్‌లో జరుగుతుందని, ముఖ్యఅతిథిగా దండోరా దళపతి మందకృష్ణ మాదిగ హాజరువుతారన్నారు.