News April 3, 2025
HYD: సెక్రటేరియట్ ముందు ఇదీ పరిస్థితి

భారీ వర్షం కారణంగా రహదారులపై వర్షపు నీరునిలిచిపోయింది. తెలంగాణ సచివాలయం వద్ద రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. అటు ఖైరతాబాద్ KCP జంక్షన్, సోమాజిగూడలో ప్రధాన రహదారులపై చెట్లు నేలకొరిగాయి. భారీగా ట్రాఫిక్ జామైంది. వాహననదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. అత్యవసరం అయితేనే బయటకురండి. SHARE IT
Similar News
News April 4, 2025
HYDలో 20 వేల మంది పోలీసులతో బందోబస్తు: CP

శ్రీరామనవమి శోభాయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నట్లు HYD సీపీ సీవీ ఆనంద్ అన్నారు. తాజాగా సీతారాంబాగ్‌లోని ద్రౌపది గార్డెన్‌లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సీతారాంబాగ్ నుంచి హనుమాన్ టేక్డీ వరకు కొనసాగే శోభాయాత్రకు ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేపడుతామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 20 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు CP స్పష్టం చేశారు.
News April 4, 2025
సికింద్రాబాద్: రైలులో బాలికకు లైంగిక వేధింపులు

సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. రక్సెల్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ బాలిక అర్ధరాత్రి 2 గంటలకు వాష్ రూమ్‌కు వెళ్లింది. ఇది గమనించిన ఓ యువకుడు ఆమెను అనుసరించాడు. బాత్రూం వద్ద అరగంట సేపు ఆపి వీడియోలు తీసి, లైంగికంగా వేధించాడు. బాధితురాలు ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు రైల్వే టోల్‌ఫ్రీ నంబరు 139కి ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
News April 4, 2025
ఖైరతాబాద్: టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మేయర్

గ్రేటర్ పరిధిలో వర్షాల పట్ల జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి జోనల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని అన్నారు. వాటర్ లాగిన్ పాయింట్లను గుర్తించాలన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే జీహెచ్ఎంసీ నంబర్ 040-21111111కు ఫిర్యాదు చేయాలని సూచించారు.