News March 1, 2025
HYD: సెలబ్రిటీలను మోసం చేసిన యువకుడిపై మరో కేసు నమోదు

గతంలో జూబ్లీహిల్స్ PS పరిధిలో సెలబ్రిటీలు, సంపన్నులను SustainKart పేరుతో మోసం చేసిన ఘటనలో జైలుకెళ్లి వచ్చిన కాంతి దత్‌పై తాజాగా CCSలో మరో కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు తీసుకొని మోసగించినట్లు సౌజన్య అనే మహిళ ఫిర్యాదు చేసింది. తృతీయ జ్యువెలరీ పేరుతో తిప్పల శ్రీజ అనే మహిళను మోసగించిన ఘటనలో కాంతి దత్ గతంలో అరెస్టయ్యాడు. తాజాగా మరో కేసు నమోదు కావడం గమనార్హం.
Similar News
News March 1, 2025
జీడి నెల్లూరు: పింఛన్ పంపిణీ చేసిన CM

జీడి నెల్లూరులో CM పర్యటన మొదలైంది. ఇందులో భాగంగా ఆయన పలువురు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను పంపిణీ చేశారు. అనంతరం పలువురు వారి సమస్యలను CM దృష్టికి తీసుకురాగా.. వాటిని పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌ను CM ఆదేశించారు. ఆయన వెంట ఎంపీ దుగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఉన్నారు.
News March 1, 2025
కొవ్వెక్కిన పంది, నీతిమాలిన జెలెన్స్కీ: రష్యా ఫైర్

డొనాల్డ్ ట్రంప్, జెలెన్స్కీ వాగ్వాదంపై రష్యా ఘాటుగా స్పందించింది. ఎవరి మద్దతూ లేకుండా ఒంటరిగా యుద్ధం చేశానన్న జెలెన్స్కీ ఓ నీతిమాలిన వాడంటూ రష్యా ఫారిన్ మినిస్ట్రీ ప్రతినిధి మరియా జఖారోవా విమర్శించారు. వైట్‌హౌస్‌లో అతడికి తగిన శాస్తి జరిగిందన్నారు. మాజీ ప్రెసిడెంట్, సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ దిమిత్రి మెద్వెదేవ్ అయితే ఏకంగా ‘కొవ్వెక్కిన పంది’ అని తిట్టారు.
News March 1, 2025
ఇతని ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి: పార్వతీపురం కలెక్టర్

పార్వతీపురం(D)కు చెందిన అప్పారావు 20ఏళ్ల క్రితం పాండిచ్చేరి వెళ్తూ టీ తాగుదామని రైల్వే స్టేషన్లో దిగగా రైలు వెళ్లిపోయింది. అప్పటి నుంచి TNలోని కలైయార్కోయిల్లో అన్నాదురై అనే వ్యక్తి వద్ద వెట్టిచాకిరి చేస్తున్నాడు. ఇటీవల లేబర్ ఆఫీసర్లు ఈయనను గుర్తించారు. అప్పారావు తన కుటుంబ వివరాలు చెప్పలేకపోతున్నాడు. దీంతో అతని గురించి తెలిసిన వారు 8333813243 నంబరుకు తెలియజేయాలని పార్వతీపురం కలెక్టర్ కోరారు.