News April 25, 2025

HYD: సెలవుల్లో జూపార్క్‌ చుట్టేద్దాం..!

image

వేసవి సెలవుల్లో జూపార్క్ అధికారులు విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. మే నెలలో జూ టూర్ పేరుతో చిన్నారులకు జూ మొత్తం చూపించనున్నారు. స్నాక్స్, భోజనం కూడా ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక ప్రత్యేకంగా రూపొందించిన కిట్ (క్యాప్, నోట్‌బుక్, బ్యాడ్జ్) ఇస్తారు. రూ.1,000 చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికే ఈ అవకాశం ఉంటుందని స్పష్టంచేశారు. 9281007836కు వాట్సప్‌లో సంప్రదించవచ్చు.

Similar News

News February 20, 2026

అమీర్‌పేటలో ప్రాణాలు కాపాడింది వీళ్లే!

image

మైత్రివనంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదాన్ని హైడ్రా డీఆర్‌ఎఫ్ సిబ్బంది సమర్థంగా అదుపులోకి తీసుకొచ్చింది. రెండో అంతస్తులో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. హైడ్రా కమిషనర్, అదనపు డైరెక్టర్, ఏడీఎఫ్‌వో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సిబ్బంది చూపిన ధైర్యసాహసాలను అభినందించారు. ప్రాణాలు కాపాడిన సిబ్బందికి సెల్యూట్.

News February 20, 2026

ఉద్యమంలో యుద్ధభూమి HYD.. ఇది కథ కాదు!

image

తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా ఉరకలేసింది. 2012-14లో HYD యుద్ధభూమిని తలపించింది. పుస్తకాలు పట్టాల్సిన విద్యార్థులు పోరుబాట పట్టారు. తెలంగాణ గొంతుక అయ్యారు. బుల్లెట్ల వర్షంలోనూ బరిగీసి నిలబడ్డారు. ముళ్ల కంచెలను తొక్కుకుంటూ దూసుకెళ్లారు. NCC గేట్ వద్ద చిందిన రక్తం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని రగిల్చింది. నాడు ‘జై తెలంగాణ’ తప్ప మరో నినాదం వినబడలేదు. ప్రపంచంలోనే ఓ గొప్ప ఉద్యమం ఇదే. ఫలితమే నేటి తెలంగాణ.

News February 20, 2026

HYD: రూ.4000 వ్యాక్సిన్ ఉచితం

image

HYDలోని బాలికలకు గుడ్ న్యూస్. గర్భాశయ క్యాన్సర్‌ను తరిమికొట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. FEB చివరి నుంచి నగరంలోని బస్తీ దవాఖానలు, PHCల్లో 14-15 ఏళ్ల బాలికలకు ఉచితంగా HPV టీకాలు వేయనున్నారు. బయట దాదాపు రూ.4,000 ఉండే ఈ ‘గార్డాసిల్ 4’ వ్యాక్సిన్ ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా లభిస్తుంది. HYD వేలాది మంది, TGలో 4.6 లక్షల మందికి మేలు జరగనుంది. ఈ వ్యాక్సిన్ 14-15 ఏళ్ల మధ్య వయస్సు గల బాలికలకు పంపిణీ చేస్తారు.