News October 15, 2025

HYD: సెల్ ఫోన్ డ్రైవింగ్.. 80 వేల కేసుల నమోదు

image

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సెల్ ఫోన్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. డ్రైవింగ్ సమయంలో ఫోన్ వాడకుండా సీపీ హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి. జనవరి 1 నుంచి అక్టోబర్ 12 వరకు 80,555 కేసులు నమోదు కాగా, అక్టోబర్ 13 నుంచి మంగళవారం వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో మరో 2,345 కేసులు నమోదైనట్లు తెలిపారు. No Call Is More Important Than a Life అంటూ ప్రచారం చేస్తున్నారు.

Similar News

News October 15, 2025

హైదరాబాద్‌: లోన్ ఆఫర్ కాల్స్‌తో జాగ్రత్త

image

హైదరాబాద్‌లో ఫేక్ ఎన్‌జీఓ లోన్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. బేగంపేట‌కు చెందిన ఓ వ్యక్తి(30) రూ. 7.9 లక్షలు మోసపోయాడు. హెచ్‌వైసీ ఫౌండర్ సల్మాన్ ఖాన్ డీపీతో వాట్సాప్ కాల్ చేసిన వ్యక్తి.. రూ.50 లక్షల లోన్ ఇస్తానని నమ్మించి, పలు ఫీజుల పేరుతో రూ. 7.9 లక్షలు వసూలు చేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అపరిచిత లోన్ ఆఫర్లను నమ్మవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.

News October 15, 2025

ఓయూ: ఎంఈ, ఎం.టెక్ పరీక్షా తేదీలు ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈ, ఎం.టెక్ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. అన్ని విభాగాల ఎంఈ, ఎం.టెక్ కోర్సుల రెండో సెమిస్టర్ మెయిన్, బ్యాక్‌లాగ్ పరీక్షలను ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు.

News October 15, 2025

పిల్లల రక్షణ, విద్యకు పక్కా ప్రణాళిక: కలెక్టర్ హరిచందన

image

పిల్లల రక్షణ, నాణ్యమైన విద్యాబోధన కోసం క్యాలెండర్ ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేసి, పక్కాగా అమలు చేయాలని అనుబంధ శాఖల అధికారులను HYD కలెక్టర్ హరిచందన ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ‘క్లాప్'(సిటీ లెవల్ యాక్షన్ ప్లాన్) అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. పిల్లల రక్షణ, నాణ్యమైన విద్య, స్వచ్ఛమైన ఆహారం అందించుటలో ఈ ప్రణాళికలు కీలకం కావాలని ఆమె సూచించారు.