News October 27, 2025
HYD: సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

2026-27 విద్యా సంవత్సరానికి 6, 9 తరగతులలో ప్రవేశాల కోసం NTA నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల గడువు అక్టోబర్ 30తో ముగియనుంది. 10- 12 ఏళ్లు (6వ తరగతి), 13-15 ఏళ్లు (9వ తరగతి) మధ్య వయస్సు ఉన్న విద్యార్థులు www.aissee.nta.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు అవకాశం ఉంటుంది. ప్రవేశ పరీక్ష జనవరి రెండో వారంలో జరుగుతుంది.
Similar News
News October 27, 2025
విజయవాడ: తుపాను ప్రభావంపై కలెక్టరేట్‌లో సమీక్ష

కలెక్టర్ లక్ష్మీశా, సీపీ రాజశేఖర్‌బాబుతో పాటు వివిధ శాఖల అధికారులు సోమవారం తుపాను అప్రమత్తతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావం తగ్గేవరకు వరి, పత్తి, మినుము, పెసర కోతలు చేయొద్దని కలెక్టర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండలం స్థాయిలోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. అన్ని శాఖల సమన్వయంపై కలెక్టర్ చర్చలు జరిపారు.
News October 27, 2025
సీఎంతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ

AP: రాష్ట్రానికి మొంథా తుఫాను ముప్పు ఉన్న నేపథ్యంలో CM CBNతో PM మోదీ ఫోనులో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం PMOతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేశ్‌కు CM సూచించారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కాల్వ గట్లు పటిష్ఠం చేసి పంట నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ఈ మేరకు నిర్వహించిన సమీక్షలో మంత్రులు లోకేశ్, అనిత, CS తదితరులు పాల్గొన్నారు.
News October 27, 2025
మొదటి అడుగు సులభం కాదు.. కానీ: ఆనంద్

ఎన్నో అడ్డంకులను అధిగమించి తవాంగ్‌కు చెందిన టెన్జియా యాంగ్కీ IPSలో చేరిన తొలి అరుణాచల్‌ప్రదేశ్ మహిళగా చరిత్ర సృష్టించారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ఆమె ప్రయాణాన్ని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ‘మొదటి వ్యక్తి కావడం ఎప్పుడూ సులభం కాదు. ఆమె వేసిన గెలుపు బాటలో ఎంతో మంది యువతులు పయనిస్తారు’ అని కొనియాడారు. ఇది తన ‘Monday Motivation’ అని రాసుకొచ్చారు.


