News June 27, 2024
HYD: సైబరాబాద్లో 18 మంది CIల బదిలీ

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 18 మంది CIలు బదిలీ అయ్యారు. కూకట్పల్లి, మాదాపూర్, చేవెళ్ల, మైలార్దేవ్పల్లి, జీడిమెట్ల, రాజేంద్రనగర్, షాద్నగర్, WPS ఐటీ కారిడార్ SHOలు, శంకర్పల్లి & మోకిల, జీడిమెట్ల, మాదాపూర్, మైలార్దేవ్పల్లి డీఐలు ట్రాన్స్ఫర్ అయ్యారు. ముగ్గురు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు, మేడ్చల్ CCSలో ఒకరు, CYB CI సెల్లో మరొకరిని బదిలీ చేస్తూ CP అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News August 31, 2025
HYD: చిట్టి గణపయ్యకు చిన్న జీపు

వినాయకచవితి నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు నగరంలో నిమజ్జనాల ఊరేగింపులు ఉత్సాహంగా జరుగుతున్నాయి. పాతబస్తీ మాదన్నపేటలో ఓ చిన్నారి చిట్టి గణపయ్య కోసం చిన్న జీపును సిద్ధం చేసింది. గణపయ్యను ఆ వాహనం మీద ఊరేగింపు చేస్తూ నిమజ్జనం చేశారు. ఈ దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకొంది.
News August 31, 2025
HYD: భూగర్భ విద్యుత్ లైన్ల నిర్మాణం ఎప్పుడు?

HYDలో భూగర్భ విద్యుత్ లైన్ల నిర్మాణం చేపడతామని ప్రభుత్వం అనేకసార్లు తెలిపింది. కానీ..ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దాదాపు రూ.15 వేల కోట్లు అవసరం ఉన్నట్లు అంచనా వేస్తున్నప్పటికీ ప్రారంభం కాలేదు. తరచూ ఓవర్ హెడ్లైన్లు తెగి పడటంతో అనేకచోట్ల ప్రాణాలు పోతున్నాయి. ఇటీవల జరిగిన ఘటనలు బాధిస్తున్నాయి. వెంటనే ఎలక్ట్రిసిటీ గ్రౌండ్ లైన్ కేబుల్స్ పనులు ప్రారంభించాలని కోరుతున్నారు.
News August 31, 2025
HYD: పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన SCR

అనివార్య కారణాల వళ్ల పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా HYD SCR అధికారులు తెలిపారు. పూర్ణ నుంచి అకోలా, అకోలా నుంచి పూర్ణా వెళ్లే 77613 రైలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు జైపూర్ హైదరాబాద్, తిరుపతి, అదిలాబాద్ రైళ్లను సైతం డైవర్ట్ చేస్తున్నట్లుగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రైలులో ప్రయాణం ప్లాన్ చేసుకునేవారు షెడ్యూల్ చూసుకోవాలని సూచించారు.