News November 7, 2025
HYD సైబర్ క్రైమ్ దుమ్మురేపే ఆపరేషన్

HYD సైబర్ క్రైమ్ పోలీసులు అక్టోబర్ ఆపరేషన్‌లో భారీ దందాలు ఛేదించారు. మొత్తం 196 కేసులు, 55 అరెస్టులు, ₹62 లక్షల రిఫండ్ చేశారు. డిజిటల్ అరెస్ట్‌లు, ఇన్వెస్ట్‌మెంట్ & ట్రేడింగ్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా మోసాల్లో దేశంలోని 8 రాష్ట్రాల నుంచి నిందితులు పట్టుబడ్డారు. సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాల్లో రూ.107 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. మరిన్ని కేసుల్లో రూ.లక్షల్లో రిఫండ్ చేశారు.
Similar News
News November 7, 2025
₹67 లక్షల లోన్ తీర్చేసిన టెకీ.. అతడిచ్చే సూచనలివే!

6 ఏళ్లలో ₹67 లక్షల హోమ్ లోన్ తీర్చడంలో నేర్చుకున్న పాఠాలను చెబుతూ టెకీ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘2019లో తీసుకున్న ₹53L లోన్‌ను ₹14L వడ్డీతో ఈ నెలలో కట్టేశా. సొంతిల్లు అంటే తొలుత ఎమోషనల్‌గా ఉన్నా తర్వాత సమస్యలొస్తాయి. మానసిక ఒత్తిడి వస్తుంది. రీపేమెంట్ ప్లాన్ ఉండాలి. ఇంటి విలువ పెరిగినా లిక్విడిటీ ఉండదు. లోన్ వల్ల కష్టపడి పనిచేస్తాం. ఆర్థిక క్రమశిక్షణ వస్తుంది’ అని redditలో పేర్కొన్నాడు.
News November 7, 2025
విషం తాగి యువకుడు ఆత్మహత్య

మదనపల్లెలో విషం తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. 2టౌన్ సీఐ రాజారెడ్డి వివరాల మేరకు.. రామారావుకాలనీకి చెందిన నాగరాజ కొడుకు శివ(24)ను కుటుంబీకులు మందలించారు. మనస్థాపానికి గురైన యువకుడు విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స చేయించి, తిరుపతి రుయాకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News November 7, 2025
డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలి: మహబూబాబాద్ ఎస్పీ

డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ రాంనాథ్ కేకన్ అన్నారు. యూట్యూబర్ అనిల్ కుమార్ యాదవ్ దేశ్ ముఖ్ డ్రగ్స్‌కి వ్యతిరేకంగా ఒక మంచి కార్యక్రమానికి చేపట్టారని, గత ఏడాది నుంచి కూడా మద్యం, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ సమాజంలో ఎంతో మంది యువకుల ఆలోచన ధోరణిని మార్చారని ప్రశంసించారు. ఈ మేరకు యాంటీ డ్రగ్స్ పోస్టర్‌ను ఎస్పీ ఈరోజు ఆవిష్కరించారు.


